కొత్త డైరెక్టర్‌తో కమిటైన కీర్తి సురేష్.. జాతీయ అవార్డు దక్కిన తర్వాత!
అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన మహానటి సినిమాలో సావిత్రిగా అబ్బురపరిచే నటన కనబర్చిన ఈమె ఇటీవలే తన బెస్ట్ హీరోయిన్ కేటగిరీలో జాతీయ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డు గెలుచుకున్న కొత్త డైరెక్టర్ తో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది కీర్తి సురేష్.
ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాలు, తమిళంలో ఓ చిత్రం అదేవిధంగా మలయాళంలో మోహన్‌లాల్ చిత్రంలో నటిస్తున్న కీర్తి తాజాగా ఈశ్వర్ కార్తీక్ అనే కొత్త డైరెక్టర్ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. మరికొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని 'పిజ్జా, పేట' చిత్రాల దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించనున్నాడు. థ్రిల్లర్ జోనర్‌లో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా అన్ని హంగులతో ఈ సినిమా రూపొందించనున్నారు. ఈ సినిమాలో కీర్తీ క్యారెక్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుందని సమాచారం.

ఈ సినిమాను తమిళంలో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. కాగా ఓ థ్రిల్లర్ జోనర్ సినిమాలో నటించడం తనకెంతో ఆనందంగా ఉందని కీర్తి సురేశ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. నటనా ప్రతిభతో జాతీయ అవార్డు దక్కించుకున్న ఈమె సౌత్ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ స్టార్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. రానున్న రోజుల్లో కీర్తి సురేష్‌కి మరిన్ని అవకాశాలు వెల్లువెత్తే అవకాశముందని అంటున్నారు.


Click it and Unblock the Notifications











