సస్పెన్స్‌కు తెర.. అతనితో 15 ఏళ్లుగా బంధం , సింగిల్ షాట్‌లో తేల్చేసిన మహానటి

ఇపుడు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా వినిపిస్తున్న అతి కొద్ది మంది స్టార్ హీరోయిన్స్ లో టాప్ బ్యూటీ కీర్తి సురేష్ కూడా ఒకరు . గత కొన్నాళ్ల నుంచి కీర్తి సురేష్ పెద్దగా ఫామ్ లో లేకపోయినప్పటికీ ఆమె పేరు వార్తల్లో నిత్యం ఏదొక రకంగా వినిపిస్తూ వచ్చింది. కానీ మొదటిసారిగా గతంలో ఎపుడు లేని విధంగా తన స్కిన్ షో చేస్తూ ఆమె హైలైట్ అయ్యింది. తర్వాత తన హిందీ సినిమా బేబీ జాన్ పోస్టర్స్, క్లిప్స్ వైరల్ కావడంతో కీర్తి పేరు బాగా వినిపించింది.

తర్వాత మళ్ళీ గ్యాప్ లో ఆకస్మికంగా తన పెళ్లి వార్తలు ఊహించని ట్విస్ట్ ఇచ్చాయి. ఇక ఇవి వైరల్ అవుతున్న తరుణంలోనే తన బాలీవుడ్ డెబ్యూ చిత్రం బేబీ జాన్ నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ చూసి అందరి మతులు పోయాయి. తెలుగు సహా సౌత్ సినిమాలో ఎంతో హోమ్లీగా కనిపించిన కీర్తి ఒక్కసారిగా తన హాట్ షోతో బ్లాస్ట్ చేసింది. డీప్ స్కిన్ షో చూపిస్తూ మత్తెక్కించిన కీర్తి సురేష్ ఇలా ఓ రేంజ్ లో కనిపిస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.

keerthy suresh opens her 15 years love story official now

అయితే ఆమె పెళ్లి మేటర్ కూడా ఇంట్రెస్టింగ్ గా మారగా కొద్దిరోజుల క్రితమే తన లైఫ్‌లో ఎలాంటి ప్రేమలు లేవు అప్పుడే పెళ్లి చేసుకోను అంటూ చెప్పుకొచ్చింది. కానీ సినీ వర్గాల్లో మాత్రం ఆమె తన చిన్ననాటి స్నేహితుడుతో ఇప్పటికే పీకల్లోతు ప్రేమలో ఉందని టాక్ వచ్చింది. అంతే కాకుండా డిసెంబర్ లోనే రెండు రోజుల పెళ్లి అది కూడా గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతోంది అని వార్తలు వచ్చాయి.

కాగా ఇవన్నీ అప్పటి వరకు అనధికారికం. కానీ ఇపుడు తన ప్రేమ, పెళ్లి మేటర్ పై స్వయంగా కీర్తి సురేష్ నుంచే ఓ క్లారిటీ వచ్చింది అని చెప్పాలి. తన ప్రియుడుతో కలిసి ఒక పిక్ ని లేటెస్ట్ గా షేర్ చేసుకొని అందులో ఇద్దరూ హ్యాపీగా దీపావళి పండుగ చేసుకుంటున్నట్టు కనిపిస్తున్నారు. అంతేకాదు దీనిపై కీర్తి తమ ప్రేమ దాదాపు 15 ఏళ్ళు నుంచి కొనసాగుతుంది అన్నట్టుగా రివీల్ చేయడం విశేషం.

దీనితో గత 15 ఏళ్ళు నుంచి ఎక్కడా చిన్న క్లూ కూడా రివీల్ చేయకుండా ఇపుడు సైలెంట్‌గా అందరికీ బ్లాస్ట్ ఇచ్చింది అని చెప్పాలి. ఇందులోనే కీర్తి ఆంటోనీ అంటూ.. బ్రాకెట్స్ లో మీకు కూడా తెలుసు అంటూ హింట్ ఇచ్చి గత కొద్దిరోజులుగా వస్తున్న ఊహాగానాలు నిజమేనని మహానటి తేల్చేసింది. సో అవి నిజం అయితే డిసెంబర్ లోనే తమ పెళ్లి అనే వార్తలు కూడా నిజమే అనుకోవాలి మరి. ఇది కూడా నిజం అయితే కీర్తి సురేష్‌కు ఇదే డిసెంబర్ లో తన పెళ్లి సహా తన హిందీ ఎంట్రీ కూడా ఉండబోతుంది అని చెప్పాలి. బేబీ జాన్ ని డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ఇప్పటికే ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X