»   » పవన్-త్రివిక్రమ్ మూవీలో ఛాన్స్: ఆనందంతో కీర్తి సురేష్ ఏం చేసిందో తెలుసా?

పవన్-త్రివిక్రమ్ మూవీలో ఛాన్స్: ఆనందంతో కీర్తి సురేష్ ఏం చేసిందో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'నేను శైలజ' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మళయాల బ్యూటీ కీర్తీ సురేశ్ తెలుగులో బంపర్ ఆఫర్ కొట్టేసింది. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకుంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ న్యూ మూవీ ఇటీవల లాంఛనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ విషయాన్ని కీర్తీ సురేశ్‌ స్వయంగా తన ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

ఆనందంతో ట్వీట్

ఆనందంతో ట్వీట్

నా నెక్ట్స్ తెలుగు మూవీ పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్లో అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది.. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు అంటూ.... చేతులెత్తి నమస్కరిస్తున్న సింబల్ తో ట్వీట్ చేసింది.

‘అత్తారింటికి దారేది’ లాంటి భారీ విజయం తర్వాత

‘అత్తారింటికి దారేది’ లాంటి భారీ విజయం తర్వాత

‘అత్తారింటికి దారేది' లాంటి భారీ విజయం తర్వాత పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. కొంత కాలంగా ఈ సినిమా విషయం వార్తల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఎట్టకేలకు ఈ మూవీ ప్రారంభం అయింది.

రామానాయుడు స్టూడియో

రామానాయుడు స్టూడియో

రామానాయుడు స్టూడియోలో శనివారం(నవంబర్ 5) ఉదయం 10.49 గంటలకు ఫిక్స్ చేసిన ముహూర్తానికి పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభించారు. దేవుడి పటాలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. హారిక అండ్ హాసిక క్రియేషన్స్ బేనర్లో సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ నెం 4గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

ల్యాండ్ మార్క్ మూవీ

ల్యాండ్ మార్క్ మూవీ

పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఈ సినిమా మా బేనర్లో ల్యాండ్ మార్క్ మూవీ అవుతుందని ఎస్ రాధాకృష్ణ తెలిపారు. డిసెంబర్ నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలిపారు.

ఇద్దరు హీరోయిన్లు

ఇద్దరు హీరోయిన్లు

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ ఫైనల్ అయింది. మరో హీరోయిన్ ఎవరనే విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. బహుషా సమంతను తీసుకునే అవకాశం ఉందని టాక్.

టాప్ టెక్నీషియన్స్

టాప్ టెక్నీషియన్స్

ఈ సినిమా టాప్ టెక్నిషియన్స్ పని చేయబోతున్నారు. సౌత్ లో ఈ మధ్య మ్యూజిక్ పరంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తుండగా, ఇండియాస్ టాప్ మోస్ట్ సినిమాటోగ్రాఫర్.... రావన్, అపరిచితుడు, యే జవాని మై దివాని, మై హూ నా లాంటి చిత్రాలకు పని చేసిన వి మణికందన్ పని చేస్తున్నారు.

ఇతర టీం

ఇతర టీం

ఈ చిత్రానికి ఆర్ట్: ఎఎస్. ప్రకాష్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పిడివి ప్రసాద్, సమర్పణ: శ్రీమతి మమత, నిర్మాత: ఎస్ రాధాకృష్ణ(చినబాబు), కథ, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్

యాక్షన్ కామెడీ

యాక్షన్ కామెడీ

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో త్వరలో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను యాక్షన్ కామెడీ ఎంటర్టెనర్ గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

భారీగా బడ్జెట్ ఎందుకు?

భారీగా బడ్జెట్ ఎందుకు?

2018 తర్వాత పవన్ కళ్యాణ్ పొలిటికల్ గా బిజీ అయిపోతారు. అందుకే పొలిటికల్ ఎంట్రీ ముందు తాను చేయబోయే సినిమా భారీగా ఉండాలని, తన కెరీర్లోనే ఓ పెద్ద బిగ్గెస్ట్ హిట్ సినిమా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట.

రూ. 100 కోట్లా?

రూ. 100 కోట్లా?

త్రివిక్రమ్ ఈ సినిమాను డిపరెంటుగా ప్లాన్ చేస్తున్నారని, అందుకే రూ. 100 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారని, పవన్ కళ్యాణ్ హీరో కాబట్టి రిస్క్ తక్కువగా ఉంటుందనే ఆలోచనలో ఈ సాహసం చేయడానికి సిద్దమయ్యారని అంటున్నారు.

రికార్డులు

రికార్డులు

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో భారీ సినిమా వస్తే పలు టాలీవుడ్లో పలు రికార్డులు బద్దలవ్వడం ఖాయం అంటున్నారు.

ఫస్ట్ టైం

ఫస్ట్ టైం

సాధారణంగా పవన్ కళ్యాణ్ ఒకేసారి రెండు సినిమాలు చేయడమే అరుదు. అయితే ఈ సారి మూడు సినిమాలకు కమిట్ కావడం విశేషం. పవన్ కల్యాణ్ కెరీర్లోనే ఇలా ఒకేసారి మూడు సినిమాలు చేయడం ఇదే తొలిసారి.

English summary
"Very happy to announce my next Telugu film with PawanKalyan sir Director #Trivikram sir, Production HaarikaHassine anirudhofficial" Keerthy Suresh tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu