మహేష్ బాబుతో కీర్తి సురేష్ రొమాంటిక్ సీన్స్.. ఆ డోస్ మామూలుగా ఉండదట!
సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేయాలని బాలీవుడ్ హీరోయిన్స్ సైతం ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. సాధారణంగా మహేష్ బాబు సినిమా అంటే కొందరు స్క్రిప్ట్ ఏమిటి అని కూడా అడగకుండా కళ్ళు మూసుకొని ఒప్పేసుకుంటారు. ఇక కీర్తి సురేష్ ఎలా ఒప్పుకుందో తెలియదు గాని మహేష్ తో రొమాంటిక్ సీన్స్ చేయడానికి పెద్దగా అభ్యంతరం చెప్పలేదట.
మహేష్ బాబు సర్కారు వారి పాటలో కీర్తి సురేశ్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో హీరో హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ సీన్స్ కాస్త ఎక్కువగానే ఉంటాయట. అంటే మరీ వల్గర్ గా కాకుండా క్యూట్ గా ఉండేలా దర్శకుడు పరశురాం స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట. పరశురామ్ సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ ఎలా ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

యువత సినిమా నుంచి గీత గోవిందం వరకు హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ఎపిసోడ్స్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి. ఇక ఇప్పడు కీర్తి సురేష్ సర్కారు వారిపాటలో ఒక బ్యాంక్ ఉద్యోగిగా కనిపించనుందట. చాలా వరకు రొమాంటిక్ సీన్స్ కి దూరంగా ఉండే కీర్తి ఈ సారి మాత్రం మహేష్ సినిమా కోసం ఒక అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది. మరి ఆ సీన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











