National Film Awards 2019: కీర్తి సురేష్ 'మహానటి' సినిమాకు జాతీయ పురస్కారం

భారతదేశంలో చలన చిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 66వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను కొద్ది సేపటిక్రితం ప్రకటించారు. కాస్త ఆలస్యంగా శుక్రవారం న్యూ ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జయదేవకర్ ఈ అవార్డులను ప్రకటించారు.

ఈ అవార్డుల్లో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా 'మహానటి'ని ఎంపిక చేసింది జ్యూరీ సభ్యుల కమిటీ. 'మహానటి' సినిమాకు జాతీయ పురస్కారం దక్కినట్లుగా ప్రకాష్ జయదేవకర్ ప్రకటించారు. అదే విధంగా ఇదే చిత్రానికి గాను ఉత్తమ తెలుగు కథానాయకిగా కీర్తి సురేష్ అవార్డు గెలుచుకుంది. తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కింది 'మహానటి' సినిమా.

Keerthy Sureshs Mahanati got award in 66th National Film Awards

సావిత్రి జీవిత కథ లోని అన్ని అంశాలను కళ్ళకు కట్టినట్లుగా ఈ సినిమాలో చూపించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. చిత్రంలో కీర్తి సురేశ్‌ టైటిల్‌రోల్‌ పోషించగా, దుల్కర్‌ సల్మాన్‌ జెమినీ గణేశన్ పాత్ర పోషించాడు. సమంత, విజయ్‌దేవరకొండ, షాలినీ పాండే తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. గతేడాది విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకొని సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు ఈ సినిమాను జాతీయ పురస్కారం దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్ ప్రముఖులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X