అప్పుడు చిరంజీవితో మా అమ్మ.. ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో నేను.. కీర్తీ సురేష్ షాకింగ్ న్యూస్

By Rajababu

నేను శైలజ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కీర్తీ సురేష్ ఇటీవల కాలంలో భారీ, ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తున్నది. ఈ ఏడాది వచ్చిన నేను లోకల్ చిత్రంలో నాని సరసన నటించి ఓ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకొన్నది. తాజాగా పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన అజ్ఞాతవాసి చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమంలో మాట్లాడుతూ అజ్ఞాతవాసి విషయాలను, తన వ్యక్తిగత అనుభవాలను చెప్పింది. ఆమె ఏమన్నారంటే..

Recommended Video

‘అజ్ఞాతవాసి’ షూటింగ్‌ అనంతరం.. ఖుష్భూ కంటతడి !
అనిరుధ్ పెన్సిల్‌లా ఉంటాడు కానీ

అనిరుధ్ పెన్సిల్‌లా ఉంటాడు కానీ

ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన చినబాబుకు ముందు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను పనిచేసిన దర్శకుల్లో మీరు చాలా మనసున్న వ్యక్తి. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ చూస్తే పెన్సిల్ ఉంటాడు. కానీ ఆయన వాయిస్ మ్యాజిక్. అను ఇమ్మాన్యుయేల్‌తో కెమిస్ట్రీ బాగా ఉంటుంది. స్క్రీన్ మీదే చూస్తే తెలుస్తుంది.

 పవర్‌స్టార్ కావడం చాలా కష్టం

పవర్‌స్టార్ కావడం చాలా కష్టం

స్టార్ కావడం చాలా కష్టం.. పవర్ స్టార్ కావడం మరీ మరీ కష్టం. అతడితో నటించడం చాలా సంతోషంగా ఉంది. నా తల్లి చిరంజీవి సరసన పున్నమినాగులో నటించింది. ఇప్పుడు నేను పవన్ కల్యాణ్‌తో నటించడం ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశం రావడం నిజంగా నాకు అదృష్టమే.

 కీర్తి సురేష్ ఎవరి కూతురంటే..

కీర్తి సురేష్ ఎవరి కూతురంటే..

ఇంతకీ కీర్తీ సురేష్ ఎవరంటే.. మలయాళంలో ప్రముఖ నిర్మాత, దర్శకుడు సురేష్ కుమార్, తమిళ నటి మేనక కూతురు. కీర్తీ తమిళ సంప్రదాయ కుటుంబానికి చెందినవారు. కీర్తీ సురేష్‌కు ఓ సోదరి రేవతి సురేష్ ఉంది. ఆమె వీఎఫ్‌ఎక్స్ స్పెషలిస్ట్‌గా గతంలో షారుక్ ఖాన్‌కు చెందిన రెడ్ చిల్లీస్‌లో పనిచేసింది.

 బాలతారగా కీర్తీ సురేష్

బాలతారగా కీర్తీ సురేష్

కీర్తీ సురేష్ 2000 ఆరంభంలోనే బాలతారగా సినిమాల్లోకి ప్రవేశించింది. పైలెట్, అచనేయనేనికిష్టం, కుబేరన్ లాంటి చిత్రాలతోపాటు పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటించింది. ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన హారర్ కామెడీ గీతాంజలి చిత్రంలో హీరోయిన్‌గా సినీ రంగ ప్రవేశం చేసింది.

 మహానటి చిత్రంలో సావిత్రిగా

మహానటి చిత్రంలో సావిత్రిగా

ప్రస్తుతం తెలుగులో ప్రఖ్యాత సినీ నటి సావిత్రి జీవిత కథా ఆధారంగా రూపొందుతున్న మహానటిలో సావిత్రి పాత్రను పోషిస్తున్నది. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది.

 డబ్బింగ్ చెప్పిన కీర్తీ సురేష్

డబ్బింగ్ చెప్పిన కీర్తీ సురేష్

పరభాష తారలు తెలుగు సినిమాల్లో తమ పాత్రలకు డబ్బింగ్ చెప్పడం చాలా అరుదు. కానీ అజ్ఞాతవాసి చిత్రంలో తన పాత్రకు కీర్తీ సురేష్ డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఇటీవలనే కీర్తీ సురేష్ ఈ చిత్రం కోసం డబ్బింగ్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X