నీవు అమాయకుడివా? నీ నిజస్వరూపం బయటపెట్టాలా? దర్శకుడు వెంకీకి కీర్తీ సురేష్ షాక్

యువ హీరో నితిన్, అందాల భామ కీర్తీ సురేష్ నటించిన రంగ్ దే చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తోపాటు నితిన్, కీర్తిసురేష్, వెన్నెల కిశోర్, అభివన్ గోమటం, నరేష్, రోహిణి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ...

నితిన్ నా తమ్ముడు లాంటి వాడు.. త్రివిక్రమ్ భావోద్వేగం.. రంగ్ దే ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్యాలరీ

త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు థ్యాంక్స్

త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు థ్యాంక్స్

ప్రేక్షకుల ముందుకు వచ్చి మూడేళ్లు అవుతున్నది. మహానటి తర్వాత మళ్లీ ఇలా మీ ముందుకు రావడం చాలా టెన్షన్‌గా ఉంది. రంగ్ దే ఈవెంట్‌కు వచ్చి మమల్ని ఆశీర్వదించిన త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు ధన్యవాదాలు. అలాగే నా మీద నమ్మకం పెట్టుకొని ఈ సినిమా ఆఫర్ ఇచ్చిన నాగవంశీ, చిన్నబాబుకు థ్యాంక్స్. రోహిణి, నరేష్‌తోపాటు ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరికి నా థ్యాంక్స్ అని కీర్తి సురేష్ అన్నారు.

దేవీ శ్రీ ప్రసాద్‌తో హ్యాట్రిక్

దేవీ శ్రీ ప్రసాద్‌తో హ్యాట్రిక్

దేవీ శ్రీ ప్రసాద్‌తో కలిసి పనిచేయడం ఇది మూడోసారి. గతంలో మేమిద్దరం రెండు సినిమాలకు పనిచేశాం. ఆ రెండు కూడా పెద్ద హిట్స్ అయ్యాయి. రంగ్ దే మూవీతో మేము హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. ఈ సినిమా మ్యూజిక్ చాలా బాగుంది. ఇప్పటికే ఈ సినిమాలోని పాటలు చాలా ఆకట్టుకొంటున్నాయి అని కీర్తీ సురేష్ తెలిపారు.

దర్శకుడు వెంకీ అమాయకుడా?

దర్శకుడు వెంకీ అమాయకుడా?

ఇక దర్శకుడు వెంకీ అట్లూరి‌ని ఉద్దేశించి మాట్లాడుతూ కీర్తీ సురేష్ హాట్ కామెంట్స్ చేశారు. అందరూ నిన్ను అమాయకుడు అనుకొంటున్నారు. కానీ నీ నిజస్వరూపం ఎవరికీ తెలియదు. నేను బయటకు చెప్పాలా అంటూ ఆయనవైపు కీర్తి సురేష్ చూస్తూ మాట్లాడి అదరగొట్టింది.

వెంకీని ఆటపట్టించిన కీర్తీ సురేష్

వెంకీని ఆటపట్టించిన కీర్తీ సురేష్

ఆ తర్వాత నీ గురించి ఏమీ చెప్పను. నీవేమీ భయపడకు. నేను జస్ట్ ఆటపట్టించడానికి అలా అంటున్నాను. వెంకీ అట్లూరి మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి. వెంకీ కథ చెప్పగానే వెంటనే ఓకే చెప్పాను. నాకు ఆఫర్ ఇచ్చిన ఆయనకు థ్యాంక్స్ అని కీర్తీ సురేష్ పేర్కొన్నారు.

నితిన్‌తో కెమిస్ట్రీ వర్కవుట్ అయిందంటూ..

నితిన్‌తో కెమిస్ట్రీ వర్కవుట్ అయిందంటూ..

తెర మీద నితిన్‌తో నా కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. నితిన్‌, వెన్నెల కిషోర్‌, అభినవ్ గోమటంతో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. మేమంత మంచి ఫ్రెండ్స్‌గా మారాం. ఈ సినిమా మార్చి 26వ తేదీన రిలీజ్ అవుతున్నది. అందరూ తప్పకుండా థియేటర్‌కు వెళ్లి ఎంజాయ్ చేయండి అంటూ కీర్తీ సురేష్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X