మనవరాలు నో: ‘రంగ్ రసియా’ సినిమా నిలిపివేత

By Bojja Kumar

కొచ్చి:19వ శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ జీవితం ఆధారంగా కేతన్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ్ రసియా'. రణదీప్ హుడా, నందనా సేన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం నవంబర్ 7న విడుదలకు సిద్ధమవుతోంది.

అయితే ఈ చిత్రంపై రాజా రవివర్మ మనవరాజలు ఇంద్రాదేవి కుంజమ్మ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టు కెక్కారు. దీంతో కరళ కోర్టు ఈ చిత్రం విడుదలపై స్టే విధించింది. ఈ చిత్రాన్ని శుక్రవారం నాడు కేరళలో విడుదల చేయొద్దని ఉత్తర్వులిచ్చింది. అళప్పుజ జిల్లాలోని మావెలిక్కర మున్సిఫ్ మేజిస్ట్రేట్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు.

Rang Rasiya

ఈ చిత్రాన్ని రంజిత్ దేశాయ్ రాసిన ‘రాజా రవివర్మ' పుస్తకం ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు. అయితే ఈ చిత్రాన్ని రాజా రవివర్మ జీవితకథకు ఆపాదించడంపై ఆయన కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజా రవివర్మ జీవితగాధకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదన్న ప్రకటన లేకుండా సినిమాను ప్రదర్శించడానికి వీల్లేదని జడ్జి ప్రసున్ మోహన్ స్పష్టం చేశారు.

ఈ చిత్రం చాలా కాలం క్రితమే పూర్తయింది. 2008లో నవంబర్లో లండన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించారు. తాజాగా ఈ చిత్రాన్ని ఇండియా వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. సందేశ్ శాండిల్య ఈ చిత్రానికి సంగీతం అందించారు. దీపా సాహి నిర్మాత.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X