twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దయచేసి సహాయం చేయండి: యాంకర్ సుమ ఎమోషనల్ రిక్వెస్ట్

    By Bojja Kumar
    |

    Recommended Video

    దయచేసి కేరళ వరద బాధితులకు సహాయం చేయండి : యాంకర్ సుమ

    భారీ వర్షాలు, వరదల కారణంగా కేరళ రాష్ట్రం చిగురుటాకులా వణికిపోతోంది. ఎడతెరిపి లేని వర్షాలతో అక్కడ జనజీవనం చిన్నాభిన్నమైంది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వందల సంఖ్యలో వరద బీభత్సానికి బలయ్యారు. కేరళ జల విలయం కారణంగా దిక్కుతోచని పరిస్థితులో ఉన్న అక్కడి ప్రజలను ఆదుకునేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు, ప్రజలు, ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాలు అందిస్తున్నారు. తెలుగు నటుడు రాజీవ్ కనకాలను పెళ్లాడి హైదరాబాద్‌లో సెటిలైన కేరళవాసి, ప్రముఖ యాంకర్ సుమ తమ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని రిక్వెస్ట్ చేశారు.

    అల్లాడి పోతున్నారు హెల్ప్ చేయండి

    అల్లాడి పోతున్నారు హెల్ప్ చేయండి

    కేరళలో వరద బీభత్సం కారణంగా చాలా మందికి తినడానికి తిండి, నీరు, పవర్ సప్లై లేదు. చాలా మంది అల్లాడి పోతున్నారు. ఈ సమయంలో మానవతా ధృక్పథంతో కేరళ చీఫ్ మినిస్టర్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ కోసం అందరూ తోచిన సహాయం అందించాలని సుమ కోరారు.

    మా ఊరు కూడా మునిగిపోయింది

    మా ఊరు కూడా మునిగిపోయింది

    మా వూరు పాలక్కడ్. వరదల కారణంగా ఈ ప్రాంతం కూడా నీట మునిగి ఉంది. అందరికీ మీరు సహాయ సహకారాలు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.... అని సుమ రిక్వెస్ట్ చేశారు.

    అందులో మీరూ భాగం కావొచ్చు

    అందులో మీరూ భాగం కావొచ్చు

    నా వంతు సాయం నేను చేస్తున్నాను. మీలో చాలా మంది చేశారని, ఇంకా చేస్తారని ఆశిస్తున్నాను. చాలా ఎన్జీవోలు యుటిలిటీ సామాన్లు సప్లై చేస్తున్నాయి. మనం కూడా అందులో భాగం కావొచ్చు అని సుమ తెలిపారు.

    తెలుగు సినీ ప్రముఖుల విరాళాలు

    తెలుగు సినీ ప్రముఖుల విరాళాలు

    కేరళ వరద బాధితుల కోసం తెలుగు సినీ ప్రముఖులు విరాళాలు అందించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరుపున రూ. 10 లక్షలు, చిరంజీవి రూ. 25 లక్షలు, నాగార్జున రూ. 28 లక్షలు, మహేష్ బాబు రూ. 25 లక్షలు, ఎన్టీఆర్ రూ. 25 లక్షలు, అల్లు అర్జున్ రూ. 25 లక్షలు, రామ్ చరణ్ రూ. 25 లక్షలు, మహేష్ బాబు రూ. 25 లక్షలు, కళ్యాణ్ రామ్ రూ. 10 లక్షలు, విజయ్ దేవరకొండ రూ. 5 లక్షలు, రామ్ పోతినేని రూ. 5 లక్షలు, కొరటాల శివ రూ. 3 లక్షలు విరాళం అందించారు.

    English summary
    "Our prayers and strength to people of Kerala in these hard times!! We request everyone to come forward and help the people in need." Anchor Suma said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X