అమలాపాల్‌ని ఇరుకున పెట్టబోతున్న కేరళ ప్రభుత్వం.. ఫేక్ అడ్రెస్‌తో 20 లక్షలు టోపీ!
కోటి రూపాయల కారు కారు కొనుగోలు చేసి పన్ను ఎగొట్టిన వ్యవహారంలో హీరోయిన్ అమలాపాల్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది. కేరళలో కారు కొన్న అమలాపాల్ పపుదుచ్చేరిలో ఫేక్ అడ్రెస్ పత్రాలు చూపించి దాదాపు 20 లక్షల టాక్స్ ఎగవేసింది. ఈ వ్యవహారంలో కేరళ ప్రభుతం అమలాపాల్ పై గుర్రుగా ఉంది.
ఆమెపై ఛార్జ్ షీట్ దాలుచేసే ఆలోచనలో కేరళ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టులో అమలాపాల్ పై చార్జ్ షీట్ దాఖలు చేయాలనీ కేరళ ప్రభుత్వం పోలీస్ క్రైమ్ బ్రాంచ్ ని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇలాంటి కేసులోనే సీనియర్ నటుడు సురేష్ గోపి కూడా ఇరుక్కుని ఉన్నారు.

పక్కాగా ఆధారాలు ఉండడంతో కేరళ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాలా కాలంగా అమలాపాల్ కేసు కొనసాగుతోంది. తాజగా ఛార్జ్ షీట్ దాఖలు చేసే నిర్ణయంతో ఈ కేసులో మరో ముందడుగు పడినట్లు చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











