twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలా చేయడం వల్ల ఎంతోమంది సూసైడ్ చేసుకుంటున్నారు.. కోహ్లీ, తమన్నాలకు హైకోర్టు నోటీసులు

    |

    ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ రమ్మీ గేమ్స్ వలన ఎంతో మంది అప్పులపాలవుతున్న విషయం తెలిసిందే. పలువురు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అయితే కొందరు సెలబ్రెటీలు మాత్రం అవేమి పట్టనట్టుగా రెమ్యునరేషన్ కు ఆశపడి రమ్మీ యాప్ లకు యదేచ్చగా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ విషయంలో చాలా మంది ప్రముఖులు అభ్యంతరం చెప్పారు. అలాగే కోర్టులు కూడా పలుమార్లు హెచ్చరికలు జారీ చేశాయి. ఇక ఇప్పుడు కొంతమంది సెలబ్రెటీలకు న్యాయస్థానాలు నోటీసులు జారీ చేస్తున్నాయి.

     స్టార్స్ తో బిగ్గెస్ట్ గ్యాబ్లింగ్

    స్టార్స్ తో బిగ్గెస్ట్ గ్యాబ్లింగ్

    ఒకప్పుడు పేకాట క్లబ్ లలో వందల కోట్ల రూపాయల బిజినెస్ గా సాగేది. ఇక ఇప్పుడు టెక్నాలజీ ద్వారా కూడా ఆ మహమ్మారి ఎన్నో కుటుంబాలని నాశనం చేస్తోంది. రియల్ రమ్మీ గేమ్ అంటూ సెలబ్రెటీల ద్వారా ప్రచారం చేయిస్తున్నారు. దీంతో అమాయక ప్రజలు ఇంత పెద్ద స్టార్ బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు అంటే కచ్చితంగా నిజమైన గేమ్ అయ్యి ఉండవచ్చని మోసపోతున్నారు.

    ఆ తరువాత సొమ్ము మొత్తం కాజేసాలా

    ఆ తరువాత సొమ్ము మొత్తం కాజేసాలా

    అయితే చాలా వరకు గేమ్ డిజైన్ చేసే గ్యాంబ్లింగ్ కంపెనీలే డబ్బును కాజేస్తున్నట్లు కేసులు బయటపడ్డాయి. ముందు ఆటల్లో నాలుగు డబ్బులు కావాలనే గెలిచేలా చేస్తారు. ఆ తరువాత సొమ్ము మొత్తం కాజేసాలా ప్లాన్ వేస్తారు. ఆన్ లైన్ రమ్మీ వలన ఎంతో మంది సూసైడ్ చేసుకున్నారు. అయితే కేరళ హైకోర్టు పలువురు సెలబ్రెటీలకు ఈ విషయంలో నోటీసులు పంపింది.

    తమన్నా, కోహ్లీలకు నోటీసులు

    తమన్నా, కోహ్లీలకు నోటీసులు

    టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గతంలో పలు ఆన్ లైన్ రమ్మీ గేమ్ సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. అలాగే టాలీవుడ్ నటి తమన్నా భాటియా కూడా అదే తరహాలో రమ్మీ గేమ్స్ కు ప్రమోషన్ చేసింది. దీంతో కేరళ హైకోర్ట్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది.

    Recommended Video

    #HappyBirthdayDishaPatani : Kohli,Dhoni కంటే Bumrah నే అసలైన మ్యాచ్ విన్నర్ : Disha Patani
    ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారని

    ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారని

    త్రిసుర్ కు చెందిన పోలి వర్గీస్ ఈ గేమ్స్ ను రద్దు చేయాలని హై కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ గేమ్స్ వలన ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నారని సెలబ్రెటీలు ప్రచారం చేయడంపై కూడా తప్పుబడుతూ వెంటనే చర్యలు తీసుకోవాలని అందులో పేర్కొనడంతో న్యాయస్థానం తమన్నా, కోహ్లీలతో పాటు మలయాళం నటుడు అజు వర్గీస్ కు కూడా నోటీసులు అందించింది వెంటనే వివరణ ఇవ్వాలని కోరారు. త్వరలో మరికొంత మంది సెలబ్రిటీలకు కూడా నోటీసులు అందించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    English summary
    It is a well known fact that online gambling rummy games cause a lot of debt. Many lives are also being lost. However, some celebrities are arbitrarily promoting rummy apps in hopes of remuneration as Awami did not. Many celebrities objected to this. Courts have also issued multiple warnings.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X