twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘గీత గోవిందం’ కేరళ వసూళ్లు మొత్తం వరద బాధితులకే!

    By Bojja Kumar
    |

    విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో బన్నీ వాసు నిర్మించిన 'గీత గోవిందం' చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళుతోంది. తొలిరోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 16 కోట్ల గ్రాస్... దాదాపు రూ. పది కోట్ల షేర్ వసూలైంది. అమెరికాలో హాలిడే లేక పోయినా బుధవారం విడుదలైన అక్కడ తొలి రోజు రూ. 3 కోట్లకుపైగా రాబట్టి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్య పరిచింది.

    సినిమా సూపర్ హిట్ అవ్వడం, భారీ వసూళ్లు వస్తుండటంతో నిర్మాతలు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్నాటక, తమిళనాడు, కేరళలో కూడా విడుదల చేశారు. కేరళలో భారీ వరదల కారణంగా ప్రజలు నిరాశ్రయులు అయిన నేపథ్యంలో కేరళలో వసూలైన షేర్ మొత్తాన్ని... వరద బాధితుల కోసం డొనేట్ చేయబోతున్నట్లు నిర్మాత బన్నీ వాసు ప్రకటించారు.

     Keralas Geetha Govindam share will be donated to Flood Relief

    బన్నీ వాసు తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఒక మంచి సినిమా తీయడమే కాదు, ఈ సినిమా ద్వారా వచ్చే వసూళ్లను సేవా కార్యక్రమాల కోసం వినియోగించాలనే నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అంటున్నారు.

    కాగా... 'గీత గోవిందం' బ్లాక్ బస్టర్ టాక్ చూస్తుంటే ఈ చిత్రం ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి రోజే దాదాపు పది కోట్ల షేర్ వచ్చిన నేపథ్యంలో లైఫ్ టైమ్ రన్‌లో రూ. 50 కోట్ల షేర్ రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

    English summary
    Producer Bunny Vas announces on behalf of Geetha Arts the total share of Geetha Govindam collects in Kerala will be donated to Kerala Flood Relief.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X