»   » 150వ మూవీ: చిరంజీవికి కేరళ ట్రీట్మెంట్ షురూ!

150వ మూవీ: చిరంజీవికి కేరళ ట్రీట్మెంట్ షురూ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి త్వరలో 150వ సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. సినిమా షూటింగు మొదలవ్వాలంటే చిరంజీవి తన ఫిజిక్‌ను పాత్రకు తగిన విధంగా సిద్దం చేసుకోవాలి. డాన్సులు, ఫైట్లు చేయాలి కాబట్టి కాస్త ఫిట్ నెస్ కూడా అవసరమే.

అందుకే షూటింగు మొదలవ్వడానికి ముందే చిరంజీవి తన వంతు ప్రయత్నం మొదలు పెట్టారు. ఇందులో భాగంగా ఆయన కేరళలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు సమాచారం. కాస్త గ్లామర్ గా కనిపించడానికి ఇక్కడ ఆయన పలు రకాల ఆయుర్వేద మసాజులు చేయించుకుంటున్నట్లు సమాచారం.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మెగా అభిమానులంతా ఆశగా ఎదురు చూస్తున్న చిరంజీవి 150వ సినిమా 2015లో తప్పుండా వస్తుందని అంటున్నారు. ఈ చిత్రానికి నిర్మాత రామ్ చరణ్ అనే విషయం తేలింది కానీ డైరెక్టర్‌ ఇంతవరకు ఫైనలైజ్‌ కాలేదు. మూడేళ్ల క్రితం 150వ సినిమా చేస్తానని చిరంజీవి చెప్పినప్పటి నుండి అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. 2014లోనే చిరంజీవి 150వ సినిమా పూర్తవుతుందని అనుకున్నారు. కానీ అనేక కారణాలతో సినిమా ఇంకా మొదలు కాలేదు. అయితే తాజాగా 150వ సినిమా 2015లో తప్పకుండా వస్తుందనే సంకేతాలు ఇచ్చారు చిరంజీవి.

 Kerala Treatment for Chiranjeevi

ఆ మధ్య తనను కలవాలని ఆశ పడుతున్న బాలు అనే క్యాన్సర్ బాధిత బాలుడిని ఇటీవల హైదరాబాదులోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో కలిసిన చిరంజీవి.....150వ సినిమా ప్రస్తావన తెచ్చారు. త్వరలోనే సినిమా ప్రారంభం అవుతుందని, ఇందులో బాలుకు కూడా నటించే అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చాడు. దీనిపై ఫ్యాన్స్ స్పందిస్తూ బాలుడు తన అభిమాన హీరో చిరును కలవడం మాత్రమే కాదు, చిరు 150వ సినిమాలో నటించడం ఆయన అదృష్టం అని అంటున్నారు. బాలుడి కోరిక తిరినందుకు మెగా ఫ్యాన్స్ సంతోషం వయక్తం చేస్తున్నారు. చిరంజీవి 150వ సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగే యాక్షన్ ఎంటర్టైనర్. ఆయన పొలిటికల్ లేదా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ఆసక్తి చూపడం లేదు. మళ్ళీ తన అభిమానులను ఎంటర్ టైన్ మాత్రమే చేయాలనుకుంటున్నారు.

English summary
Relying on Kerala based spa and ayurvedic treatments including a massage and rejuvenation, Megastar Chiranjeevi is getting the ground work for his 150th movie prepared.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu