ఆమెని రేప్ చేస్తాం అంటూ బెదిరించిన అల్లు అర్జున్ ఫాన్స్.. సంచలనంగా మారిన రచ్చ!
Recommended Video

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు టాలీవుడ్ లోనే కాదు.. మలయాళంలో కూడా భారీ స్థాయిలో అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ చిత్రాలు మలయాళంలో కూడా విడుదలై మంచి విజయాలు సాధిస్తుంటాయి. ఇటీవల అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య చిత్రం విడుదలై అభిమానులని నిరాశపరిచింది. దేశ భక్తి కథాంశంతో వచ్చిన ఈ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వలేదు. నా పేరు సూర్య చిత్రం మలయాళంలో కూడా విడుదలయింది. ఈ చిత్ర విషయంలో కేరళ రచయితకు, బన్నీ ఫాన్స్ కు మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈ గొడవ కాస్త పెద్దదై సంచలనంగా మారింది.

సైనికుడిగా బన్నీ
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా చిత్రంలో బన్నీ సైనికుడిగా కనిపించాడు. బోర్డర్ కు వెళ్లాలని కళలు కనే మిలటరీ వ్యక్తి పాత్ర అది. ఆగ్రహావేశాలతో రగిలిపోయే దేశభక్తి కలిగిన యువకుడి పాత్రలో బన్నీ అద్భుతంగా నటించాడు.

అన్నీ ఉన్నప్పటికీ
దేశ భక్తి కథాంశంతో రూపొందినప్పటికీ దర్శకుడు ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలని పొందుపరిచారు. అయినా కూడా ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.

రచయిత్రి కామెంట్స్
అల్లు అర్జున్ ఫాన్స్, కేరళ రచయిత్రి అపర్ణ ప్రశాంతి మధ్య నెలకొన్న వివాదం తీవ్రంగా మారింది. నా పేరు సూర్య చిత్రం గురించి అపర్ణ ఫాన్స్ ని బాధించే వ్యాఖ్యలు చేశారు.

రేప్ చేస్తాం అంటూ
దీనితో బన్నీ ఫాన్స్ నుంచి ఆమెకు బెదిరింపులు వెళ్లినట్లు తెలుస్తోంది. హత్య, రేప్ కు సంబంధించి అపర్ణ బెదిరింపులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆమె కేరళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదు చేసింది. గత రెండు వారాలుగా ఆమె ఈ బెదిరింపులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











