ఎగిసిపడే 'కెరటం' (ప్రివ్యూ)
కృష్ణంరాజు మరో నటనవారసుడైన సిదార్థ్‌రాజ్ కుమార్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఎస్వీబాబు నిర్మించిన చిత్రం కెరటం ఈ రోజు విడుదల అవుతోంది. కన్నడ చిత్రం జోష్ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో సిద్ధు (సిద్దార్థ రాజ్‌కుమార్) చలాకీ కుర్రాడుగా కనిపిస్తాడు. కాలేజీ జీవితమంటే హాయిగా గడపడమే అనుకొంటాడు. గీత (ఐశ్వర్య)తో స్నేహం అతని ఆలోచనల్ని మారుస్తుంది. లక్ష్యం దిశగా నడిచే ప్రయత్నం చేసిన సిద్దూ జీవితం ఎన్ని మలుపులు తిరిగింది? వీరిద్దరి మధ్యకీ వచ్చిన సంగీత (రకుల్ ప్రీత్ సింగ్) ఎవరు అనే విషయాలు ఆసక్తికరం.ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ .ఇది యూత్ కి సంబంధించిన సినిమా మాత్రమే కాదు. పెద్దవాళ్లూ చూడవలసిన సినిమా. కథే ఈ చిత్రానికి ప్రధానమైన బలం. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్ ఆకట్టుకొంటాయి. జోష్వా శ్రీధర్ సంగీతం అందరికీ నచ్చుతుందని అన్నారు.
సంస్థ: ఎస్.వి.ప్రొడక్షన్స్
నటీనటులు: సిద్ధార్థ రాజ్‌కుమార్, ఐశ్వర్య, రకుల్ ప్రీత్‌సింగ్, భీమినేని శ్రీనివాసరావు, శ్రీనాథ్, సుమన్, వేణుమాధవ్, ప్రదీప్, అలోక్, శిల్ప తదితరులు
నిర్మాత: ఎస్.వి.బాబు
దర్శకత్వం: గౌతమ్ పట్నాయక్
విడుదల: శుక్రవారం.


Click it and Unblock the Notifications











