శృతి హాసన్‌కు నరకం చూపించాడు, అతడొక క్రిమినల్.. పీవీపీపై కేశినేని సంచలనం!

Recommended Video

AP Assembly Election 2019 : Kesineni Nani Sensetional Comments On PVP | Oneindia Telugu

పోలింగ్ కు సమయం దగ్గరపడుతున్న వేళ రాజకీయ నేతల మధ్య విమర్శలు వేడి పెరుగుతోంది. ఏప్రిల్ 11న జరగబోయే ఏపీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో చాల మంది సినీప్రముఖులు పోటీ చేస్తున్నారు. విజయవాడ వైసిపి ఎంపీ అభ్యర్థిగా సినీ నిర్మాత, వ్యాపారవేత్త పొట్లూరి వరప్రసాద్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. టిడిపి ఎంపీ అభ్యర్థి కేశినేని నాని తాజాగా మీడియాతో మాట్లాడుతూ పీవీపీపై సంచలన ఆరోపణలు చేశాడు. పీవీపీ వలన చాలామంది సినీ ప్రముఖులు ఇబ్బంది పడ్డారని, అతడొక క్రిమినల్ అని ఆరోపించారు.

శృతి హాసన్‌ని బ్లాక్ మెయిల్ చేసి

శృతి హాసన్‌ని బ్లాక్ మెయిల్ చేసి

కేశినేని నాని మాట్లాడుతూ పొట్లూరి వరప్రసాద్ ఒక క్రిమినల్ అని అభివర్ణించారు. చిత్ర పరిశ్రమలో చాలా మందికి పివిపి నరకం చూపించాడు. పివిపి వలన ఇబ్బందిపడ్డవారిలో హీరోయిన్ శృతి హాసన్ ప్రముఖురాలు అని నాని తెలిపారు. ఆమెని వేధించి, బ్లాక్ మెయిల్ చేసి కాల్ షీట్స్ తీసుకున్నారని నాని ఆరోపించారు. కేవలం శృతి హాసన్ మాత్రమే కాదు పివిపి బారీన పడ్డ నటులు చాలా మందే ఉన్నారని నాని అన్నారు.

మహేష్ బాబు తప్ప

మహేష్ బాబు తప్ప

సూపర్ స్టార్ మహేష్ బాబు తప్ప మిగిలిన వారంతా పివిపి వేధింపులకు గురయ్యారు. వీరిలో దర్శకులు, నటులు, హీరోయిన్లు ఉన్నారు. కానీ మహేష్ బాబు మాత్రం పివిపి చేతికి చిక్కలేదని నాని తెలిపారు. ప్రతి ఒక్కరిని లీగల్ నోటిసుల పేరుతో బ్లాక్ మెయిల్ చేసినట్లు కేశినేని నాని పేర్కొన్నారు. చిత్ర పరిశ్రమ మొత్తం పివిపిని అసహ్యించుకుంది అని నాని ఆరోపించారు.

అతడొక క్రిమినల్

అతడొక క్రిమినల్

పీవీపీ పెద్ద క్రిమినల్ అని నాని ఆరోపించారు. బ్యాంకులకు 137 కోట్లు ఎగ్గొటిన విషయంలో అతడిపై ఆరోపణలు ఉన్నాయి. మనీ లాండరింగ్ కేసులు, స్కాములు ఇలా అతడిపై చాలా ఆరోపణలు ఉన్నట్లు నాని తెలిపారు. సెబీ సంస్థ కూడా పీవీపీకి 30 కోట్ల జరిమానా విధించినట్లు నాని పేర్కొన్నారు. ఇటీవలే ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అంటూ పీవీపీ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేపాయి.

సినీ నిర్మాతగా

సినీ నిర్మాతగా

పొట్లూరి వర ప్రసాద్ నిర్మాతగా పలు చిత్రాలు తెరకెక్కించారు. ఊపిరి, బ్రహ్మోత్సవం, ఘాజి, సైజ్ జీరో లాంటి చిత్రాలని పీవీపీ నిర్మించారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న మహర్షి చిత్రానికి కూడా నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు. ఇటీవల వైసిపిలో చేరిన పివిపి ఆ పార్టీ తరుపున విజయవాడ ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. రాజకీయ నాయకుడిగా పీవీపీ అదృష్టం ఎలా ఉందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X