twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లక్ష్మీ పార్వతికి 10 ప్రశ్నలు... దీనికి ఆమె వద్ద సమాధానం ఉందా?

    |

    లక్ష్మీ పార్వతి తీరును ముందు నుంచి వ్యతిరేకిస్తున్న తెలుగు ఫిల్మ్‌మేకర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ఆమె అసలు కథ ఇదే అంటూ 'లక్ష్మీస్ వీరగ్రంథం' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన లక్ష్మీ పార్వతిని నిలదీస్తూ ఆయన 10 ప్రశ్నలు సంధించారు. లక్ష్మీ పార్వతిలో నిజాయితీ ఉంటే నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. నేను సమాజంలో విలువల కోసం పోరాటం చేస్తున్న వ్యక్తిని, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మీకు ఉంది అంటూ ఓ వీడియో విడుదల చేశారు.

    అప్పుడే ఎందుకు ఖండించలేదు?

    అప్పుడే ఎందుకు ఖండించలేదు?

    రామారావు గారు ధర్మపీఠం అనే ఇంటర్వ్యూలో నీ కోరిక మేరకే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం జరిగింది అని చెప్పారు. మీరేమో.. రామారావుగారే ఈ ప్రపోజల్ తీసుకొచ్చారు, లక్ష్మీ నన్ను పెళ్లి చేసుకుంటావా? అని కోరారు చెప్పడం జరిగింది. మరి అపుడు ఆ ధర్మపీఠంలో మీరు కూడా ఉన్నారు. ఆయన చెప్పేది తప్పు అని ఎందుకు ప్రశ్నించలేదు? ఇపుడు రామారావుగారు చనిపోయిన తర్వాత వారే నన్ను పెళ్లి చేసుకుంటానని అడిగారు అని చెప్పడం కరెక్టా?

    సహజీవనమే బావుందా?

    సహజీవనమే బావుందా?

    మరొక ఇంటర్వ్యూలో మీరు మీ మొదటి భర్తకు విడాకులు ఇవ్వకుండా వారితో సహజీవనం చేసినపుడు నా జీవితం బావుంది అని చెప్పారు. ఇదేమి సాంప్రదాయం? ఇలా అనడం ద్వారా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? పెళ్లి కంటే రహస్యంగా చేసిన సహజీవనమే బావుందా?

    తన జీవితంలో నుంచి వెళ్లిపోవాలన్నా...

    తన జీవితంలో నుంచి వెళ్లిపోవాలన్నా...


    రామారావుగారు మిమ్మల్ని తన జీవితంలో నుంచి వెళ్లిపో లక్ష్మీ.. మళ్లీ లెక్చరర్‌గా జాయిన్ అయి కొడుకుతో సుఖంగా ఉండు అని కోరడం జరిగిందని ఒక ఇంటర్వ్యూలో మీరే చెప్పడం జరిగింది. రామారావుగారు మానసికంగా ఎంత క్షోభకు గురయ్యి ఆ రకంగా మాట్లాడారు అనేది మీరు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఆయనకు కుటుంబం పట్ల ఉన్న ప్రేమ, కుటుంబ సభ్యులు ఆయన దగ్గరకు రావడం లేదనే బాధ ఆయన్ను వెంటాడింది. నువ్వు వెళ్లిపోతే అన్ని సెట్ రైట్ అయిపోతాయనే ఉద్దేశ్యం ఆయనకు ఉందా? లేదా?

    కులం గురించి మాట్లాడటం ఏమిటి?

    కులం గురించి మాట్లాడటం ఏమిటి?

    లక్ష్మీ పార్వతిగారు ఒక సందర్భంలో నేను అగ్ర కులమైన కమ్మ కులంలో పుట్టడం నేను చేసుకున్న తప్పు. అదే ఇతర ఎస్సీ, ఎస్టీ, బీసీ కులంలో పుట్టి ఉంటే నాకు న్యాయం జరిగేది అన్నారు. నువ్వు అసలు కులం అని ఎలా మాట్లాడతావు? ప్రజాస్వామ్యంలో ఒక శాసన సభ్యురాలిగా పని చేసి సమ సమాజ నిర్మాణం కోసం పాటు పడాల్సిన వ్యక్తిగా నువ్వు చెప్పే ఈ సమాధానం కరెక్టా?

    రామారావుగారికి పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినపుడు ఆయన ఎటువంటి ఉద్రేకతకు లోను కాకూడదను అని డాక్టర్లు చెప్పినట్లు మీరే తెలిపారు. మీరు చెప్పినదాని ప్రకారం ఆలోచిస్తే రామారావుగారు తన ద్వారా ఒక బిడ్డకు జన్మనివ్వాలని కోరినట్లు, మీకు అబార్షన్ అయినట్లు చెప్పారు. వైద్యులు ఉద్రేకపూరితమైన సందర్భం వద్దని చెప్పినా కూడా మీరు ఆ సందర్భానికి ఎలా శ్రీకారం చుట్టారు?

    ఆ రోజు ఎందుకు ఖండించలేదు?

    ఆ రోజు ఎందుకు ఖండించలేదు?

    వీరగంధం సుబ్బారావుగారు ఒక మహోన్నతమైన వ్యక్తి. నువ్వు వారి జీవితంలోకి ప్రవేశించి నేను నిన్ను తప్ప ఎవరికీ పెళ్లి చేసుకోను, మీరంటే నాకు ఇష్టం అని చెప్పి.. ఆరోజు ఆయన పెళ్లికి నిరాకరించినా సూసైడ్ చేసుకోవడానికి సిద్ధపడి ఆయన్ను ఒప్పించారు. ఈ విషయాన్నీ ఆయన బ్రతికుండగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇపుడు ఆయన్ను దుర్భాషలాడుతున్న నువ్వు... ఆ రోజు ఆయన చెప్పిన విషయాలను ఎందుకు ఖండించలేదు?

    ఇది రామారావు ఆస్తి కాదా?

    ఇది రామారావు ఆస్తి కాదా?

    కొడుకులకు ఆస్తిని, అల్లుళ్లకు అధికారాన్ని కట్టబెట్టారని మీరు చాలా సందర్బాల్లో చెప్పారు. మీకు ఏమీ ఇవ్వలేదనే బాధను ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కటిక బీద కుటుంబం నుంచి వచ్చిన మీరు ఈ రోజు అనుభవిస్తున్నదంతా రామారావుగారు కల్పింది కాదా? ఆయన ఆస్తి కల్పింది కాదా?

    సూట్ కేసులు ఎందుకు తరలించారు?

    సూట్ కేసులు ఎందుకు తరలించారు?

    రామారావుగారు చనిపోయిన రోజు మీరు సూట్ కేసులు తరలింపు చేయడం ఎంత వరకు కరెక్ట్? మీరే ఓ ఇంటర్వ్యూలో నేను నాలుగు సూట్ కేసులు ఇస్తే రెండు సూట్ కేసులు మాత్రమే వెనక్కి వచ్చాయని చెప్పడం జరిగింది. ఒక వైపు రామారావు భౌతిక కాయం అక్కడ ఉండగా సూట్ కేసులు తరించి అలా చేయడం ఎంత వరకు కరెక్ట్? ఆ రోజు రామారావుగారి భౌతిక కాయాన్ని స్టేడియంకు తరలించినపుడు.. సాయంకాలం వరకు కూర్చోవాలి అని చెప్పి మీ వంటవాడితో ఉప్మా చేయించుకుని ఫుల్లుగా తిని పోయింది నిజం కాదా?

    మోహన్ బాబు ఇంట్లో ఉంచి చదివించడానికి కారణం?

    మోహన్ బాబు ఇంట్లో ఉంచి చదివించడానికి కారణం?

    రామారావు గారు కోటేశ్వరప్రసాద్ అనే నీ కుమారుడిని తన చెంతకు రానీయలేదు. అతడిని మోహన్ బాబు ఇంట్లో ఉంచి చదివించడానికి కారణం ఏమిటి?

    ఆస్తి ఎవరికి ఇస్తావు?

    ఆస్తి ఎవరికి ఇస్తావు?

    రామారావు వల్ల ఇప్పటి వరకు సంక్రమించిన ఆస్తులన్నీ రాబోయే రోజుల్లో నీ తదనంతరం నందమూరి కుటుంబ సభ్యులకు రాస్తారా? వీరగంధం సుబ్బరావు ద్వారా జన్మించిన నీ కుమారుడికి రాస్తారా? బసవతారకం ట్రస్టుకు రాస్తారా? ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది.

    వెన్ను పోటుకు నువ్వు సహకరించలేదా?

    వెన్ను పోటుకు నువ్వు సహకరించలేదా?

    చంద్రబాబును పార్టీ నుంచి బహిష్కరిస్తానని ఆ రోజు రామారావు చెబితే... నువ్వు చంద్రబాబు వద్దకు వెళ్లి భరోసా ఇచ్చి... రామారావుగారికి చెప్పి ఆయన్ను పార్టీలోకి తీసుకొచ్చావు. అలాంటి నువ్వు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడని చెబుతున్నావు. తిరిగి చంద్రబాబు నాయుడును రామారావు చెంత చేర్చి అసలు వెన్ను పోటుకు కారణం నువ్వు కాదా? నీ యొక్క లక్ష్యం కోసం, నువ్వు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యంతో చంద్రబాబుతో ప్రమాణం చేయించుకుని.. నువ్వు రామారావుకు వెన్నుపోటు పొడిచావు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. నువ్వు మాట్లాడిన అంశాల ఆధారంగానే నేను ప్రశ్నిస్తున్నాను. వీటన్నింటికీ నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని... కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

    English summary
    Kethireddy Jagadishwar Reddy 10 Questions to Lakshmi Parvathi. Kethireddy Jagadishwar Reddy is telugu film maker, who is now directing Lakshmi's Veeragandham.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X