"లక్ష్మీ పార్వతి దేవత అని ఎవరైనా అంటే సినిమా ఆపేస్తా"

లక్ష్మీ పార్వతి దేవత అని ఎవరైనా అంటే తాను సినిమా ఆపేస్తానని దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.

By Bojja Kumar

Recommended Video

"లక్ష్మీ పార్వతి దేవత అని ఎవరైనా అంటే సినిమా ఆపేస్తా"

మహా నటుడు ఎన్టీఆర్ జీవితాన్ని బేస్ చేసుకుని బాలకృష్ణ ఓ సినిమా, రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి 'లక్ష్మీస్‌ వీరగ్రంధం' పేరుతో మరో సినిమాను చేయడానికి సిద్ధమయ్యారు.

'లక్ష్మీస్‌ వీరగ్రంధం' సినిమాను ఆపాలని తనకు బెదిరింపులు వస్తున్నాయని, తాను ఈ సినిమా తీయకుండా లక్ష్మీపార్వతి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆరోపించారు. ఎవరి బెదిరింపులకు తాను లొంగను, ఎవరూ నన్ను ఆపలేరు అని తేల్చి చెప్పారు.

 లక్ష్మీస్ వీరగ్రంథం

లక్ష్మీస్ వీరగ్రంథం

‘లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా నవంబర్ 12న మొదలవుతుందని, ఎక్కువ భాగం షూటింగ్ పొన్నూరు, వినుకొండల్లో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నామని తెలిపారు.

 లక్ష్మీ పార్వతి దేవత అని ఎవరైనా చెబితే ఆపేస్తా

లక్ష్మీ పార్వతి దేవత అని ఎవరైనా చెబితే ఆపేస్తా

‘లక్ష్మీస్‌ వీరగ్రంధం' సినిమాపై అవసరమైతే ఓపెన్‌ బ్యాలెట్‌ పెట్టడానికి తాను సిద్ధమని, అందులో 10 శాతం మంది ప్రజలు లక్ష్మీ పార్వతి దేవత అని చెప్పినా సినిమా ఆపి ఆమె పాదాలకు వందనం చేస్తానని కేతిరెడ్డి తెలిపారు.

 సినిమా కోసం వివరాల సేకరణ

సినిమా కోసం వివరాల సేకరణ

సినిమాకు సంబంధించిన వివరాలు సేకరించడంలో భాగంగా నిర్మాత జి.విజయకుమార్‌గౌడ్‌, చిత్రబృందంతో కలిసి కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్నారు.

 మొదటి భర్త వీరగంధం వెంకట సుబ్బారావు

మొదటి భర్త వీరగంధం వెంకట సుబ్బారావు

లక్ష్మీపార్వతి మొదటి భర్త వీరగంధం వెంకట సుబ్బారావు బ్రతికున్నపుడు వినుకొండలో ‘వీరగంధం కళాకేంద్రం' నిర్మించారు. దాన్ని సందర్శించిన చిత్ర యూనిట్ అప్పటి వివరాలను గ్రామ పెద్దలను అడిగి తెలుసుకున్నారు. దీంతో పాటు వీరగంధం స్వగ్రామం ఈదర భీమవరంలోనూ పర్యటించారు.

లక్ష్మీపార్వతి స్వగ్రామం

లక్ష్మీపార్వతి స్వగ్రామం

లక్ష్మీపార్వతి స్వగ్రామం పచ్చలతాటిపర్రు, పొన్నూరు ప్రాంతాల్లో కూడా దర్శక నిర్మాతలు పర్యటించారు. ఆయా గ్రామాల్లోని పెద్ద మనుషులను ఆడిగి లక్ష్మిపార్వతి గురించిన వివరాలు తెలుసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X