లక్ష్మీపార్వతి నిజస్వరూపం బయటపెడుతా.. ఎన్టీఆర్ జీవితంలోకి ప్రవేశించి.. అడ్డుకొంటే.. కేతిరెడ్డి

ఎన్టీఆర్ కుటుంబాన్ని, చంద్రబాబును కించపరిచే విధంగా వారి ప్రతిష్టను దెబ్బ తీసేందుకు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నాడు. లక్ష్మీ పార్వతి చెప్పిన వెర్షన్‌నే ఆయన సినిమా తీశాడు. లక్ష్మీ పార్వతి మహాసాధ్వి ఈ భూభాగంలో లేదనట్టు, స్వామి సేవకు వచ్చినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నారు అని లక్ష్మీ వీరగ్రంథం దర్శకుడు, నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఎన్టీఆర్ జీవితం ఆధారంగా వస్తున్న సినిమాలు వివాదంగా మారుతున్న సమయంలో కేతిరెడ్డి ఓ మీడియాతో మాట్లాడుతూ..

ఎవరినీ విలన్‌గా చూపించం

ఎవరినీ విలన్‌గా చూపించం

లక్ష్మీస్ వీరగ్రంథం సినిమాలో ఎవరినీ విలన్‌గా చూపించం. తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి సేకరించిన విషయాల ఆధారంగా మా సినిమా ఉంటుంది. ఎన్టీఆర్ కుటుంబాన్ని, చంద్రబాబును విలన్‌గా చూపించినట్టుగా నేను చూపించను. నా వద్ద సపరేట్ వెర్షన్ ఉంది. నేను చూపించబోయేదే వాస్తవం. లక్ష్మీపార్వతి పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా చూపించడం లేదు.

లక్ష్మీపార్వతిని ఎలా పెళ్లి చేసుకొన్నాడనే

లక్ష్మీపార్వతిని ఎలా పెళ్లి చేసుకొన్నాడనే

మహానుభావుడు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎలా ప్రవేశించింది? ఆయనను పెళ్లి చేసుకునేలా ఎలా ప్రేరేపించింది. పెళ్లికి దారి తీసిన విషయాలు చాలా క్లారిటీగా తెరకెక్కించాం. సినీరంగంలో శ్రీదేవి, ఇతర అందాల హీరోయిన్లు చూసిన ఎన్టీఆర్.. అతి సామాన్యమైన మహిళను ఎలా పెళ్లి చేసుకొన్నారనే విషయాలు వాస్తవంగా చూపించాం.

స్వర్గీయ ఎన్టీఆర్ మీద ప్రేమతో

స్వర్గీయ ఎన్టీఆర్ మీద ప్రేమతో

ఇప్పటి వరకు వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్‌‌లు లాభాపేక్ష, ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తీసిన సినిమాలు. కానీ నేను తీసే సినిమానే వాస్తవం. ఎందుకంటే ఎన్టీఆర్ ఆత్మ నాకు చెప్పిన విషయాలను తెరకెక్కించాను. ఎన్టీఆర్ మీద ప్రేమతో సినిమాను రూపొందిస్తున్నాం.

సినిమాను అడ్డుకొంటే చర్యలు తీసుకొంటాం

సినిమాను అడ్డుకొంటే చర్యలు తీసుకొంటాం

లక్ష్మీ పార్వతి నా సినిమాలను వ్యతిరేకించడంలో ఎలాంటి తప్పులేదు. ఎందుకంటే ఆమె ఒరిజినల్ క్యారెక్టర్‌ను, జనానికి తెలియని రెండో కోణంలో చూపించబోతున్నప్పుడు లక్ష్మీ పార్వతి ఎందుకు ఒప్పుకొంటుంది? ఆమె అడ్డుకొంటే చట్టపరమైన చర్యలు తీసుకొంటాం. ఎన్నికల్లో లబ్ది పొందడానికి నేను సినిమా తీయడం లేదు.

 కుటుంబ సభ్యుల నిజాయితీని చూపిస్తాం

కుటుంబ సభ్యుల నిజాయితీని చూపిస్తాం

ఎన్టీఆర్ బయోపిక్, లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలకు కౌంటర్‌గానే నా లక్ష్మీస్ వీరగ్రంథం ఉంటుంది. నా వద్ద ఉన్న కొన్ని క్లిప్పింగులను ఆధారంగా చేసుకొని సినిమా తీశాను. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల నిజాయితీని చూపించబోతున్నాం. ఎన్టీఆర్ పిల్లలకు ఆయనపై ఉన్న ప్రేమను చూపించబోతున్నాం. అలాగే చంద్రబాబు, లక్ష్మీ పార్వతి కారణంగా ఎన్టీఆర్ చనిపోయారని చూపించబోతున్నాం.

నిజస్వరూపం చూపిస్తాను

నిజస్వరూపం చూపిస్తాను

లక్ష్మీ పార్వతి నిజస్వరూపం చూపించబోతున్నాం. ఎన్టీఆర్ ఉన్నప్పుడు.. లేనప్పుడు ఎలా బిహేవ్ చేసేవారో అనే విషయాన్ని స్పష్టంగా చూపిస్తాం. నేను బెదిరింపులకు భయపడని వ్యక్తిని. అలా భయపడితే సినిమా ఎందుకు తీస్తాం. భయపడితే గమ్మున ముగుసుకొని ఇంట్లో ఉండేవాడిని. బోడి బెదిరింపులకు భయపడేది లేదు.

రాజకీయాల్లో వెన్నుపోట్లు లేవు

రాజకీయాల్లో వెన్నుపోట్లు లేవు

పబ్లిసిటీ కోసమే రాంగోపాల్ వర్మ సినిమాలు, వివాదాలు సృష్టిస్తాయి. నా సినిమా ద్వారా లక్ష్మీ పార్వతి నిజస్వరూపం చూపిస్తా. రాజకీయాల్లో వెన్నుపోట్లు ఉండవు. పదవీ కాంక్ష ఉంటుంది. నా సినిమా ద్వారా లక్ష్మీ పార్వతి క్లారిటీ ఇస్తాను. నిక్కచ్చి అంశాలు ఉంటాయి అని

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X