twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘నోటా’ ఒక పార్టీకి కొమ్ముకాసే చిత్రంగా ఉంది: దర్శకుడి ఫిర్యాదు

    |

    తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో 'నోటా' సినిమా విడుదల మీద అభ్యంతరం వ్యక్తం చేస్తూ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. 'నోటా' అనే చిత్రం ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాసే చిత్రంగా ఉందని, దాన్ని డీజీపీ, ఎన్నికల కమీషన్ సభ్యులు కలిసి చూడాలి. చూసిన తర్వాత దాని విడుదలపై ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు.

    ఈ సినిమా ట్రైలర్లోనే అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి. బార్లో మద్యం తాగుతున్న వ్యక్తిని తీసుకెళ్లి ముఖ్యమంత్రిని చేసినట్లు చూపించారు. ఇది నేటి రాజకీయ వ్యవస్థకి వ్యతిరేకంగా ఉంది. అదే సమయంలో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉంది. ఈ సినిమాను ఆపమని మేము అడగటం లేదు కానీ... ఈ చిత్రాన్ని ఎలక్షన్ కమీషన్, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ హోం, రెవెన్యూ అందరూ కలిసి ఒక కమిటీగా ఏర్పడి చూసి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నామని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

    Kethireddy Jagadishwar Reddy on NOTA controversy

    అక్టోబర్ 5న తెలంగాణ రాష్ట్రంలో సినిమా విడుదల ఉంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది కాబట్టి మేము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. 'నోటా ' అంటేనే గవర్నమెంటు నిర్ణయించిన ఒక శాసనం. ఆ శాసనాన్ని టైటిల్‌గా వాడటం కూడా కూడా తప్పు. సెన్సార్ ఇప్పటి వరకు కాలేదు కాబట్టి సెన్సార్ అధికారి కూడా సర్టిఫికెట్ ఇవ్వకూడదని, కమిటీ చూసిన తర్వాతే సర్టిఫికెట్ ఇవ్వాలని కోరడం జరిగిందని జగదీశ్వర్ రెడ్డి తెలిపారు.

    సినిమా రిలీజ్ అవ్వొద్దు అనే వ్యతిరేకత మాకు లేదు. అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే ఎలక్షన్ తర్వాత సినిమా రిలీజ్ అవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాన్నారు. సినిమాలంటే మొన్న మనం చూసిన 'శ్రీమంతుడు'లా ఉండాలి. కానీ 'నోటా'లో అభ్యంతరక సన్నివేశాలన్నాయి. సామాన్యుడైన ఒక రోడ్డు మీద తిరిగే కుర్రవాడు, బార్లలో తిరిగే కుర్రవాడు, టకీలా తాగుతుంటే అతడు చెప్పిన డైలాగులు... బార్లో డాన్స్ వేస్తుంటే నన్నెందుకు ముఖ్యమంత్రిగా చేశారు అనడం సరిగా లేదు. వ్యవస్థను మార్చడానికి సినిమాలు ఒక బాటకావాలి కానీ, ఇలాంటి సినిమాలు వచ్చి రాజకీయ వ్యవస్థ మీద తప్పుడు అభిప్రాయం కలిగిస్తున్నాయని కేతి రెడ్డి అన్నారు.

    English summary
    Director Kethireddy Jagadishwar Reddy complaint against Vijay Devarakonda starrer NOTA. Jagadishwar Reddy appealing the Election Commission to watch the movie, to take a decision whether to allow the movie to release during the election season in Telangana or not.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X