twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లక్ష్మీ'స్ వీరగ్రంథం లో ఏం ఉంటుందీ? ఆ విషయాలన్నీ చెబుతారట, మళ్ళీ ఇంకో గొడవా..?

    ఎన్టీఆర్ బయోపిక్ రేసులోకి లేటుగా వచ్చిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మాత్రం తాను తీయబోయే "లక్ష్మీస్ వీరగ్రంథం" సినిమాను జనవరిలో మొదలుపెట్టి ఫిబ్రవరిలో రిలీజ్ చేసేస్తానంటున్నాడు.

    |

    ఓవైపు నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ సినిమా తీయడానికి సిద్ధమవుతున్న తరుణంలోనే రామ్ గోపాల్ వర్మ "లక్ష్మీస్ ఎన్టీఆర్" అంటూ దానికి కౌంటర్ అన్నట్లుగా సినిమా అనౌన్స్ చేశాడు. ఇంతలో కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనే దర్శక నిర్మాత "లక్ష్మీస్ వీరగ్రంథం" అంటూ మరో సినిమాతో ముందుకొచ్చాడు. ఈ సినిమా టైటిల్ అదీ చూస్తేనే.. ఇది లక్ష్మీపార్వతిని లక్ష్యంగా చేసుకుని తీయబోతున్న సినిమా అని అర్థమైంది.

     ఎన్టీఆర్ బయోపిక్

    ఎన్టీఆర్ బయోపిక్

    నందమూరి బాలకృష్ణ తీయబోయే ఎన్టీఆర్ సినిమా మొదలవడానికి ఇంకా సమయం పట్టేలా ఉంది. రామ్ గోపాల్ వర్మ తీయాలనుకున్న ఎన్టీఆర్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో క్లారిటీ లేదు. కానీ ఈ రెండు సినిమాల నేపథ్యం లో మొదలైన "లక్ష్మీ'స్ వీరగ్రంథం" మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గటం లేదు.

     ఫిబ్రవరిలో రిలీజ్

    ఫిబ్రవరిలో రిలీజ్

    లేటుగా రేసులోకి వచ్చిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మాత్రం తాను తీయబోయే "లక్ష్మీస్ వీరగ్రంథం" సినిమాను జనవరిలో మొదలుపెట్టి ఫిబ్రవరిలో రిలీజ్ చేసేస్తానంటున్నాడు. అసలు ఈ సినిమాలో తాను ఏం చూపించబోతున్నది ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

     ఈ విషయాలు మాత్రమే

    ఈ విషయాలు మాత్రమే

    లక్ష్మీపార్వతి.. ఎన్టీఆర్‌కు ఎలా పరిచయమైంది.. ఆయన్ని ఎలా ఆకర్షించింది.. ఆయన్ని ఎలా పెళ్లాడింది.. ఈ విషయాలు మాత్రమే తాను చూపించబోతున్నానని కేతిరెడ్డి చెప్పాడు. ఎన్టీఆర్-లక్ష్మీపార్వతిల పెళ్లితో ఈ సినిమా ముగుస్తుందని చెప్పాడు కేతిరెడ్డి.

     ఎన్టీఆర్ జీవిత చరిత్ర

    ఎన్టీఆర్ జీవిత చరిత్ర

    ఎన్టీఆర్ జీవిత చరిత్ర రాస్తానన్న కారణం చెప్పి లక్ష్మీపార్వతి ఆయన్ని కలిసి.. ఆయన దగ్గర ఎలా సానుభూతి పొంది.. ఆయన్ని పెళ్లి దాకా తీసుకెళ్లిందో ఈ సినిమాలో చూపిస్తానని కేతిరెడ్డి చెప్పాడు. లక్ష్మీపార్వతి ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఎంతగా బెదిరించినా తాను ఈ సినిమా తీయడం ఖాయమని కేతిరెడ్డి అన్నాడు.

    వాణివిశ్వనాథ్‌

    వాణివిశ్వనాథ్‌

    ఈ సినిమా కోసం వాణివిశ్వనాథ్‌తో పాటు ఇంకొందరిని అడిగామని.. కానీ ఈ సినిమా చేయడం మంచిది కాదని చెప్పడంతో వాళ్లు వెనక్కి తగ్గారని.. ప్రస్తుతం ప్రియమణి, పూజాకుమార్‌లతో చర్చలు జరుపుతున్నామని.. ఎన్టీఆర్ పాత్రకు మరాఠీ రంగస్థల నటుడిని తీసుకుంటున్నామని కేతిరెడ్డి చెప్పాడు. ఈ చిత్ర బడ్జెట్ రూ.3 కోట్లని చెప్పాడు.

    English summary
    Kethireddy Revelas Lakshmi's Veeragrandham Release Date, movie shoot will be started in January and release on February
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X