గుడివాడలో పోటీ చేసే దమ్ముందా? బాలకృష్ణకు వైసీపీ ఎమ్మెల్యే సవాల్
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఏపీ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలను గెలుచుకోవడం భారీ చర్చకు దారి తీసింది. గత కొద్దికాలంగా ఏపీలోని 175 స్థానాలను గెలుచుకొంటామని సవాల్ విసురుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల తర్వాత టీడీపీ ప్రతి సవాల్ విసిరింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత.. పులివెందులలో ఓటమి తర్వాత మీరు 175 స్థానాలు గెలుచుకొంటామని సవాల్ విసురుతారా అని టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సవాల్ విసిరారు. బాలయ్య సవాల్‌పై వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్పందిస్తూ సెటైర్లు వేశారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ఏమన్నారంటే?

ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఏపీలో 175 స్థానాలు గెలుచుకొంటామని సవాల్ చేస్తున్నాం. బాలకృష్ణ చేసిన సవాల్‌పై స్పందిస్తూ.. తెలుగుదేశం పార్టీకి 40 ఏళ్ల చరిత్ర ఉంది. అలాంటి పార్టీకి 175 స్థానాల్లో అభ్యర్థులు లేరు. అలాంటి పార్టీకి మాపై సవాల్ విసిరే అర్హత లేదు. నీకు (బాలయ్య), నీ ఫ్రెండ్ (పవన్ కల్యాణ్)కు అభ్యర్థులే లేరు. ఆ పార్టీ నుంచి.. ఈ పార్టీ నుంచి అభ్యర్థులను పీక్కుంటున్నారు అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎద్దేవా చేశారు.

40 ఏళ్ల పార్టీకి అభ్యర్థులు లేకనే
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్త పార్టీ. ఆ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి నాయకులు వచ్చారంటే ఓ అర్ధం ఉంది. 40 ఏళ్ల పార్టీకి అభ్యర్థులు లేకనే ఇతర పార్టీల నుంచి లాగుతున్నారు. ఇప్పటికే 175 సీట్లు మా టార్గెట్. మీ టార్గెట్ ఎంతో చెప్పు. మీరు కనీసం 125 అని చెప్పండి.. లేదా కనీసం 70 అని చెప్పండి. నీవు పొత్తు పెట్టుకొని 20 సీట్లు ఇచ్చి.. ముఖ్యమంత్రిని చేస్తున్నావా? అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రశ్నించారు.

గుడివాడలో పోటీ చేసే దమ్ముందా?
ఇక సినీ నటుడు బాలకృష్ణను టార్గెట్ చేస్తూ.. హిందూపురంలో గెలిచావు కదా.. నీ సొంత ఊరు గుడివాడకు వెళ్లి పోటీ చేయి. చిరంజీవిని సొంత ఊర్లో ఓడించారు. మీ నాన్న ఎన్టీఆర్‌ను మహబూబ్ నగర్‌లో ఓడిస్తే.. హిందూపురంలో గెలిపించి రాయలసీమ అక్కున చేర్చుకొన్నది. మీరు నాకు నీతులు చెబుతున్నావా? మా నాన్న ఇది చేశారని చెప్పి.. గుడివాడలో పోటి చేసే దమ్ముందా?.. మీరు సొంత ఊరికి వెళ్లలేరు. మీరు సొంత ఊరిలో పోటీ చేయలేరు అని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అన్నారు.

నాగబాబు ప్రశ్నించడంపై గట్టిగా
పులివెందులలో ఎందుకు గెలవకూడదని నాగబాబు ప్రశ్నించడంపై గట్టిగా బదులిచ్చారు. మీరు పులివెందులలో కూడా పోటీ చేయండి. మేము ఎందుకు గెలవకూడదని అనడంలో న్యాయం ఉంది. కానీ మీరు ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తారో ముందు చెప్పండి.. 20 స్థానాల్లో పోటీ చేస్తారా? 40 స్థానాల్లో పోటీ చేస్తారా ముందు చెప్పండి. మేము 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెబుతున్నాం. మీరు ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో తేల్చి చెప్పండి అంటూ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సవాల్ విసిరారు.

బాలకృష్ణ విసిరిన సవాల్‌పై
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాజకీయాలు రణరంగంగా మారాయి. టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య పరస్పర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒకరిని మించి మరొకరు విమర్శించుకొంటున్నారు. పులివెందుల ప్రాంతంలో తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం సాధించిన తర్వాత టీడీపీలో జోష్ పెరిగింది. ఈ సందర్భంగా పులివెందుల్లో విజయం సాధిస్తారా అంటూ బాలకృష్ణ విసిరిన సవాల్‌పై ఎమ్మెల్యే కేతిరెడ్డి స్పందించారు.


Click it and Unblock the Notifications











