Don't Miss!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
లక్ష్మీస్ వీరగ్రంథం వెనుక ఉన్నది ఆయనే.. లక్ష్మీపార్వతి ఆగ్రహం.. తెరపైకి నాలుగో బయోపిక్?
Recommended Video
మహానటుడు, ప్రజానేత నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లపై ప్రస్తుతం టాలీవుడ్లో హాట్‌హాట్‌గా చర్చ జరుగుతున్నది. ఓ పక్క రాంగోపాల వర్మ, బాలకృష్ణ తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్‌లు వివాదాస్పదంగా మారతున్న నేపథ్యంలో సడెన్‌గా మధ్యలో దూరాడు మరో దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. లక్ష్మీ పార్వతి జీవిత కథ ఆధారంగా లక్ష్మీస్ వీరగ్రంథం అనే చిత్రాన్ని రూపొందించనున్నట్టు ఆయన ప్రకటించారు. దాంతో టాలీవడ్తోపాటు రాజకీయ వర్గాల్లో కూడా అలజడి మొదలైంది. లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రం తీయడానికి ఆయన వెనుక ఎవరున్నారు అనే విషయంపై చర్చ జరుగుతుండగా నా వెనుక ఎవరున్నారో తెలుసా అంటూ కేతిరెడ్డి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
లక్ష్మీస్ వీరగ్రంథం.. తెరపైకి మరో ఎన్టీఆర్ బయోపిక్.. లక్ష్మీ పార్వతిగా లక్ష్మీరాయ్
ఆయనే సహాయం చేస్తున్నాడు..
లక్ష్మీస్ వీరగ్రంథం సినిమా తీయడానికి ప్రధాన కారణం మహానటుడు, అన్న ఎన్టీఆర్. ఆ మహానుభావుడు నా కలలోకి వచ్చి స్క్రిప్టుకు సహాయం చేస్తున్నారు. తన జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని విషయాలను స్వయంగా ఎన్టీఆర్ నాకు వివరిస్తున్నాడు అని కేతిరెడ్డి ఇటీవల మీడియాకు వివరించారు. ఎన్టీఆర్ చెప్పిన విషయాలను ఉన్నది ఉన్నట్టుగా తీస్తాను అని ఆయన వివరించడం ఆసక్తిగా మారింది.
లక్ష్మీపార్వతిపై విస్తృత పరిశోధన
‘లక్ష్మీస్ వీరగ్రంథం' సినిమా పనుల వేగాన్ని పెంచాడు కేతిరెడ్డి. లక్ష్మీ పార్వతి భర్త వీరగంధం సుబ్బారావు సొంత గ్రామానికి వెళ్లి వివరాలు సేకరించాడట. లక్ష్మీపార్వతితో ఆయన పెళ్లి ఎలా జరిగింది? హరికథా కళాకారిణిగా, హార్మోనియం కళాకారిణిగా లక్ష్మీపార్వతి ఎలా మారింది? ఎన్టీఆర్‌కు ఎలా దగ్గరైంది అనే అంశాలపై ఆయన విస్తృత పరిశోధన చేసినట్టు తెలుస్తున్నది.
లక్ష్మీపార్వతిగా ఎవరంటే..
లక్ష్మీపార్వతి పాత్రను పోషించేందుకు పలువురు యువ హీరోయిన్లను దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సంప్రదించినట్టు తెలిసింది. వారిలో వాణి విశ్వనాథ్, లక్ష్మీరాయ్, పార్వతి మెల్టన్ తదితరులు ఉన్నారు. అయితే ఆ పాత్రను ఎవరు పోషిస్తారో అనే విషయంపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో మరింత ఆసక్తి పెరిగింది.
లక్ష్మీపార్వతి ఆగ్రహం
కాగా, తన జీవిత కథపై ‘లక్ష్మీస్ వీరగ్రంథం' పేరుతో కేతిరెడ్డి జగదీష్‌రెడ్డి, లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో వర్మ తీస్తున్న చిత్రంపై ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. తన మనోభావాలకు వ్యతిరేకంగా ఏమైనా అంశాలు ఉంటే సహించేది లేదు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొంటాను అని ఆమె ఇటీవల బహిరంగంగా హెచ్చరించారు.
తెరపైకి మరో బయోపిక్
ఇదిలా ఉండగా, రాంగోపాల్ వర్మ రూపొందించబోయే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా, ఏపీ ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడును టార్గెట్ చేస్తూ కొన్ని సన్నివేశాలు ఉండబోతున్నాయట. తెలుగు దేశం పార్టీకి చెందిన వారు కూడా వర్మ సినిమాకు కౌంటర్‌గా లక్ష్మీపార్వతిని టార్గెట్ చేస్తూ ఓ సినిమాను రూపొందించే విషయంపై దృష్టిపెడుతున్నట్టు సమాచారం.