twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ఉయ్యాలవాడ’పై పిచ్చి కూతలు వద్దు: డైరెక్టర్ వార్నింగ్

    By Bojja Kumar
    |

    మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరిసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మొదలైన తర్వాతే ఉయ్యాలవాడ గొప్పదనం గురించి, ఆయన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ఓ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ అనే విషయంలో చాలా మందికి తెలిసింది. అప్పటి వరకు ఉయ్యాలవాడ చరిత్ర గురించి తెలియని వారు తెలుసుకోవడం ప్రారంభించారు.

     ఘనంగా ఉయ్యాలవాడ వర్దంతి

    ఘనంగా ఉయ్యాలవాడ వర్దంతి

    ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఫిబ్రవరి 22, 1847లో బ్రిటిష్ వారి చేతిలో ఉరితీయబడ్డాడు. ఆయన వర్ధంతి వేడుక కుటుంబ సభ్యులు ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ‘లక్ష్మీస్ వీరగ్రంధం' చిత్ర దర్శకుడు కేతిరెడ్డి జగనదీశ్వర్ రెడ్డి హాజరయ్యారు.

    Recommended Video

    సైరా మూవీ షూటింగ్ అప్ డేట్స్ !
    నేషనల్ లీడర్‌గా ప్రకటించాలి

    నేషనల్ లీడర్‌గా ప్రకటించాలి

    ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని నేషనల్ లీడర్‌గా ప్రకటించాలని కేతిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తాము ఇప్పటికే ప్రెసిడెంట్, ప్రైమినిస్టర్, ఇతర కేంద్రమంత్రులను కలిసి వినతిపత్రం అందించినట్లు వెల్లడించారు. అదే విధంగా ఏపీ సీఎం చంద్రబాబును కలిసి అమరావతిలో ఉయ్యాలవాడ విగ్రహం ప్రతిష్టించాలని కోరినట్లు తెలిపారు.

    కేతిరెడ్డి డిమాండ్లు

    కేతిరెడ్డి డిమాండ్లు

    ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని జాతీయ నాయకుడిగా ప్రకటించడంతో పాటు పార్లమెంటులో అతడి విగ్రహం పెట్టాలని, యూనివర్శిటీల్లో ఉయ్యాలవాడపై లెక్చర్స్ ఇవ్వాలని, ఆయన వర్ధంతిని సెలవురోజుగా ప్రకటించాలని, ఆయనపై పోస్టల్ స్టాంపులు రిలీజ్ చేయాలని.... కేతిరెడ్డి డిమాండ్ చేశారు.

     రెస్పాన్స్ లేదు...

    రెస్పాన్స్ లేదు...

    అయితే కేతిరెడ్డి చేస్తున్న డిమాండ్లకు సరైన రెస్పాన్స్ రావడం లేదు. పార్లమెంటులో ఆయన విగ్రహం పెట్టాలని కోరితే అక్కడ స్థలం లేదని ఓ అధికారి జవాబు ఇచ్చారట. ఆయన ఇతర డిమాండ్లకు కూడా ప్రభుత్వాలు, అధికారులు సరిగా స్పందించడం లేదని సమాచారం. దీనిపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

     దర్శకుడు సురేందర్ రెడ్డితో మాట్లాడా

    దర్శకుడు సురేందర్ రెడ్డితో మాట్లాడా

    ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్యారెక్టర్, ఇమేజ్ ఏ మాత్రం డ్యామేజ్ కాకుండా సినిమా తీయాలని దర్శకుడు సురేందర్ రెడ్డిని కోరామని, సినిమాలో ఎలాంటి నెగిటివిటీ లేకుండా సినిమా తీస్తున్నామని ఆయన చెప్పారని... కేతిరెడ్డి తెలిపారు.

     పిచ్చి కూతలు మానండి

    పిచ్చి కూతలు మానండి

    ఇటీవల కొందరు మేధావి ముసుగులో నరసింహారెడ్డిపై పిచ్చికూతలు కూస్తున్నారు. అలాంటి వారంతా మేధావి ముసుగు వేసుకున్న పిచ్చివారే అని, ఉయ్యాలవాడపై ఏమైనా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని కేతిరెడ్డి వెల్లడించారు.

    English summary
    Tamil Nadu Telugu Yuvashakti president Ketireddy Jagadeeswar Reddy has recently expressed his solidarity with the family members of Uyyalawada Narasimha Reddy family member on the occasion of his death anniversary. On this occasion, Ketireddy revealed about the work he is doing related to Uyyalawada.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X