బికినీ పాపలతో అల్లరి నరేష్ ‘కెవ్వుకేక’ బ్యాంకాక్(ఫోటోలు)
హైదరాబద్: బ్లేడ్ బాబ్జీ వంటి విజయంతమైన చిత్రం తర్వాత అల్లరి నరేష్-దేవిప్రసాద్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'కెవ్వు కేక'. షర్మిల మాంద్రే కథానాయిక. జాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరి 2 నుంచి 18 వరకు బ్యాంకాక్ లోని అందమైన ప్రదేశాల్లో కీలక సన్నివేశాలు, యాక్షన్ ఎపిసోడ్, ఒక పాటను చిత్రీకరించారు. ఈ రోజు నుంచి ఈ నెల 24 వరకు పొల్లాచ్చిలో ఓ పాట చిత్రీకరణ జరుపనున్నారు. మార్చి 3 నుంచి 15 వరకు హైదరాబాద్ లో జరిగే షూటింగుతో 90 శాతం షూటింగ్ పూర్తి చేయనున్నారు.
దర్శకుడు సినిమా గురించి వెల్లడిస్తూ 'నరేష్ పాత్ర వైవిద్యంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం పూర్తి వినోదభరితంగా ఉంటుంది. తప్పకుండా నరేష్, నా కాంబినేషన్ మరో విజయవంతమైన చిత్రంగా ఇది నిలిచిపోతుందనే నమ్మకం ఉంది' అన్నారు. అల్లరి నరేష్ సినిమాల నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఈచిత్రంలో ఉంటాయన్నారు.
నరేష్, షర్మిల మాంద్రే, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, అలీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రానికి కథ: దేవిప్రసాద్, వేగేశ్న సతీష్, మాటలు: వేగేశ్న సతీష్, కెమెరా: అడుసుమిల్లి విజయ్ కుమార్, సంగీతం: చిన్ని చరణ్, భీమ్స్, ఎడిటర్: నందమూరి హరి, నిర్మాణ నిర్వహణ: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు, సమర్పణ: శ్రీమతి నీలిమ, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దేవి ప్రసాద్.

బ్యాంకాక్‌లో బికినీ భామలతో కలిసి అల్లరి నరేష్ ‘కెవ్వుకేక' షూటింగులో పాల్గొన్నప్పటి దృశ్యం.

హీరోయిన్ షర్మిల మాంద్రేతో కలిసి బ్యాంకాక్ సముద్ర తీరంలో కెవ్వుకేక మూవీ షూటింగులో భాగంగా స్పీడ్ బోట్ పై చక్కర్లె కొడుతున్న అల్లరి నరేష్

హీరోయిన్ షర్మిల మాంద్రేతో కలిసి బ్యాంకాక్ సముద్ర తీరంలో కెవ్వుకేక మూవీ షూటింగులో అల్లరి నరేష్

అకెవ్వుకేక మూవీ షూటింగులో భాగంగా బోటు షికారు చేస్తున్న హీరో హీరోయిన్లు అల్లరి నరేష్, షర్మిల మాంద్రే

బ్యాంకాక్ లో ‘కెవ్వు కేక' మూవీ టీం, దర్శక నిర్మాతలు, ఇతర నటీటనలు ఉన్నారు

బ్యాంకాక్ లో యూనిట్ సభ్యులతో కలిసి అల్లరి నరేష్

కెవ్వు కేక మూవీ షూటింగులో అలీ సోదరుడు ఖయ్యుం, ఈ చిత్రంలో ఖయ్యం కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

కెవ్వు కేక మూవీ షూటింగులో కృష్ణ భగవాన్, ఈ చిత్రంలో కృష్ణ భగవాన్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.

దర్శకుడు దేవిప్రసాద్ తో కలిసి హీరో అల్లరి నరేష్ బ్యాంకాక్ షూటింగులో పాల్గొన్నప్పటి దృశ్యం

సోదరుడు ఖయ్యుంతో కలిసి అలీ కెవ్వుకేక షూటింగులోభాగంగా బ్యాంకాక్ లో....

బ్యాంకాక్ సముద్ర తీరంలో హీరో అల్లరి నరేష్, హీరోయిన్ షర్మిల మాంద్రే, కృష్ణ భగవాన్


Click it and Unblock the Notifications











