అక్టోబర్ 3 నుంచి అల్లరి నరేష్ ‘కెవ్వు కేక’

By Srikanya

హైదరాబాద్ : ప్రేక్షకులలో విపరీతమైన ఆదరణ పొందిన పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్ ఐటం సాంగ్ టైటిల్‌గా ఆ మధ్యన ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అల్లరి నరేష్ హీరోగా దేవీప్రసాద్ దర్శకత్వంలో జాహ్నవీ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'కెవ్వు కేక'. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని కులుమనాలి చిత్రం నిర్మించిన బొప్పన చంద్రశేఖర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. హీరోయిన్ గా గా కొత్త నటిని పరిచయం చేస్తారని తెలిసింది.

అల్లరి నరేష్ మాట్లాడుతూ దేవీ, సతీష్ తన కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలన్నీ విజయవంతమయ్యాయని, అలాగే ఈ చిత్రం కూడా కామెడీ కేక పుట్టించేలా విజయవంతమవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. హాస్యనటులందరూ కలిసిన కామెడీ క్లబ్‌లా ఈ చిత్రం వుంటుందని, మేక తోకను వూపాలి కానీ తోక మేకను వూపకూడదని, అలాగే పీకలో నుంచి కేక రావాలని, అలాంటి కెవ్వు కేక పెట్టించే చిత్రమిదని దర్శకుడు దేవీప్రసాద్ తెలిపారు.

అక్టోబర్ 3 నుండి రెగ్యులర్ షూటింగ్‌కు వెళతామని, అక్టోబర్, నవంబర్‌లలో పాటల చిత్రీకరణ ఉంటుందని, రెండున్నర గంటలపాటు అందర్నీ నవ్వించేలా ఈ చిత్రం రూపొందనుందని నిర్మాత బొప్పన చంద్రశేఖర్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఎ.విజయ్‌కుమార్, సంగీతం: రాజ్-శివ, బీమ్స్, చిన్నిచరణ్, ఎడిటింగ్: నందమూరి హరి, నిర్మాత: బొప్పన చంద్రశేఖర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవీప్రసాద్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X