అల్లరి నరేష్ ‘కెవ్వు కేక’ రిలీజ్ డేట్
హైదరాబద్: బ్లేడ్ బాబ్జీ వంటి విజయంతమైన చిత్రం తర్వాత అల్లరి నరేష్-దేవిప్రసాద్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'కెవ్వు కేక'. షర్మిల మాంద్రే కథానాయిక. జాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని జులై 19న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సినిమా కామెడీ ఎంటర్టెనర్‌గా, కమర్షియల్ అంశాలతో రూపొందుతోంది. సినిమా అన్ని వర్గా ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు.
దర్శకుడు మాట్లాడుతూ 'నరేష్ పాత్ర వైవిద్యంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం పూర్తి వినోదభరితంగా ఉంటుందని' తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండే ఈచిత్రాన్ని త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. నరేష్, షర్మిల మాంద్రే, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, అలీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
ఈచిత్రానికి కథ: దేవిప్రసాద్, వేగేశ్న సతీష్, మాటలు: వేగేశ్న సతీష్, కెమెరా: అడుసుమిల్లి విజయ్ కుమార్, సంగీతం: చిన్ని చరణ్, భీమ్స్, ఎడిటర్: నందమూరి హరి, నిర్మాణ నిర్వహణ: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు, సమర్పణ: శ్రీమతి నీలిమ, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దేవి ప్రసాద్.


Click it and Unblock the Notifications











