అల్లరి నరేష్ ‘కెవ్వు కేక’ రిలీజ్ ఎప్పుడంటే?
హైదరాబద్: బ్లేడ్ బాబ్జీ వంటి విజయంతమైన చిత్రం తర్వాత అల్లరి నరేష్-దేవిప్రసాద్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'కెవ్వు కేక'. షర్మిల మాంద్రే కథానాయిక. జాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై శ్రీమతి నీలిమ సమర్పణలో బొప్పన చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇటీవలే పొల్లాచ్చి, బ్యాంకాక్ లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం ఈచిత్రం షూటింగు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. త్వరలో సినిమాను విడుదల చేయనున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ నిమిత్తం మీడియా సమావేశం ఏర్పాటు చేసారు చిత్ర యూనిట్ సభ్యులులు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 'సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో రూపొందుతున్న పూర్తి వినోదాత్మక చిత్రమిది. నరేష్ పాత్ర చిత్రానికి హైలెట్ గా ఉంటుంది. దర్శకుడు మాట్లాడుతూ 'నరేష్ పాత్ర వైవిద్యంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం పూర్తి వినోదభరితంగా ఉంటుందని' తెలిపారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండే ఈచిత్రం మే నెలలో విడుదల చేయనున్నట్లు తెలిపారు.
నరేష్, షర్మిల మాంద్రే, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, అలీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈచిత్రానికి కథ: దేవిప్రసాద్, వేగేశ్న సతీష్, మాటలు: వేగేశ్న సతీష్, కెమెరా: అడుసుమిల్లి విజయ్ కుమార్, సంగీతం: చిన్ని చరణ్, భీమ్స్, ఎడిటర్: నందమూరి హరి, నిర్మాణ నిర్వహణ: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు, సమర్పణ: శ్రీమతి నీలిమ, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: దేవి ప్రసాద్.


Click it and Unblock the Notifications











