నందమూరి హీరో సినిమాలో ‘గబ్బర్ సింగ్’సాంగ్
మెగాస్టార్-నందమూరి కుటుంబాల మధ్య ఎప్పుడూ పోటా పోటీ వాతావరణం ఉంటుంది. ఇరు కుటుంబాల వారు ఒకరిని అధిగమిస్తూ మరొకరు టాప్ పొజిషన్లో నిలబడటానికి ఎప్పటికప్పుడు ట్రైచేస్తుంటారు. రికార్డుల విషయంలోనూ ప్రత్యేక దృష్టి పెడుతుంటారు. మరి అలాంది పోటీ వాతావరణంలో ఉన్న వీరు ఒకరి సినిమాలోని పాటను మరొకరు వాడుకుంటున్నారంటే ఆశ్యర్యమే మరి.
నందమూరి హీరో తారక రత్న ప్రస్తుతం 'మైక్ టెస్టింగ్ 123' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ చిత్ర పతాకంపై నిర్మిస్తోన్న ఈ సినిమాకి వీరు.కె దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. తారకరత్న జోడీగా అర్చన నటిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఈచిత్రంలో దేవానందం అనే డ్రామా డైరెక్టర్ గా నటిస్తున్నాడు తారక రత్న. ఈచిత్రంలో తను వేసిన డ్రామాలో గబ్బర్ సింగ్ చిత్రంలోని 'కెవ్వుకేక సాంగు'పై డాన్స్ చేయిస్తాడట తారకరత్న. తొలిసారిగా ఆయన ఈ సినిమాలో కామెడీని పండించబోతున్నాడు.
తారకరత్న ప్రస్తుతం 'విజేత' అనే మరో కూడా నటిస్తున్నారు. పి ఉదయ భాస్కర్ దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రాన్ని వి దొరస్వామి రాజు నిర్మిస్తున్నారు. సంజన మరియు శ్వేత బసు ప్రసాద్ ఈ చిత్రంలో కథానాయికలుగా కనిపించనున్నారు. ఇదొక త్రికోణ ప్రేమకథ. ఇద్దరు అమ్మాయిలు ఒకే అబ్బాయిని ప్రేమిస్తారు తరువాత జరిగే పరిణామాలను అతను ఎలా ఎదుర్కున్నాడు అనేది ఈ చిత్ర కథ. ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్" అని తారకరత్న తెలిపారు. అర్జున్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం జూలైలో చిత్రీకరణ మొదలు పెట్టుకోనుంది.


Click it and Unblock the Notifications











