పవన్ హిట్ పాటతో అల్లరి నరేష్ టైటిల్

By Srikanya

అల్లరి నరేష్‌ సినిమాలకు పెట్టే టైటిల్స్ ,ఆయన సినిమాల్లాగానే తమాషాగానే ఉంటాయి.మరోసారి ఆయన సినిమాకు అలాంటి సరదా పేరునే ఎంచుకొన్నారు. అదే... 'కెవ్వు కేక'. పవన్ కళ్యాణ్ గబ్బర్‌సింగ్‌ చిత్రంతో పాపులర్ పొందిన పాటలోని మాటలివి. ఈ చిత్రానికి దేవీ ప్రసాద్‌ దర్శకత్వం వహిస్తారు. నరేష్‌ తో గతంలో 'బ్లేడు బాబ్జీ'చిత్రం చేసిన హిట్ కొట్టిన దర్శకుడు కాంబినేషన్ కావటంతో మంచి అంచనాలే ఉంటాయి. బొప్పన చంద్రశేఖర్‌ నిర్మాత. ఈ నెల 25 నుంచి షూటింగ్ మొదలవుతుంది. హీరోయిన్ గా గా కొత్త నటిని పరిచయం చేస్తారని తెలిసింది.

ఇక ప్రస్తుతం అల్లరి నరేష్ ..సుడిగాడు చిత్రంలో చేస్తున్నారు. విరివిగా సినిమాలు చేస్తూ, వరుసగా విజయాలు సాధిస్తూ పరిశ్ర మలో దూసుకుపోతున్న అల్లరి నరేష్‌కు 'సుడిగాడు' అనే టైటిల్ నిజంగా యాప్ట్. ఇది పరిశ్రమలో పలువురి అభిప్రాయం కూడా. అదృష్టవంతుడుకి పర్యాయపదం 'సుడిగాడు'. టైటిల్‌తో సగం హిట్టు కొట్టేశారు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. చంద్రశేఖర్ డి.రెడ్డి ఈ సినిమాను నిర్మాత. శ్రీవసంత్ స్వరాలను అందించిన ఈ సినిమా పాటలను ఈ నెల 23న విడుదల చేయనున్నారు.

ఈ సందర్భంగా భీమినేని మాట్లాడుతూ -''సినిమా రంగం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఇందులో మేం చేసిన ఓ ప్రయోగం ప్రేక్షకుల పొట్ట చెక్కలు చేస్తుంది. ఇప్పటివరకూ నరేష్ చేసిన సినిమాలతో పోలిస్తే... ఇది కచ్చితంగా ప్రత్యేకమైన సినిమా'' అన్నారు.

మోనాల్ గజ్జర్, రచనా మౌర్య కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో చంద్రమోహన్, సాయాజీ షిండే, జీవా, బ్రహ్మానందం, అలీ, పోసాని కృష్ణమురళి, చలపతిరావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, జయప్రకాష్‌రెడ్డి, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, కృష్ణభగవాన్, కోవై సరళ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మూల కథ: అముదన్, రచనా సహకారం: అనిల్, నారాయణ, హరి, గోపి, సంగీతం: శ్రీవసంత్, కెమెరా: విజయ్ ఉలగనాథ్, ఎడిటింగ్: గౌతంరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వివేక్ కూచిభొట్ల.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X