ప్రతీ ప్రేక్షకుడు నవ్వు ఆపుకోలేక ‘కెవ్వుకేక’
నరేష్‌కు జోడీగా షర్మిల మాండ్రే నటిస్తున్న ఈ చిత్రాన్ని జాహ్నవి ప్రొడక్షన్స్ పతాకంపై బొప్పన చంద్రశేఖర్ నిర్మిస్తున్నారు. చిత్రీకరణ మొత్తం పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించి పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు సినిమా విశేషాలు మీడియాకు వెల్లడించారు.
దర్శకుడు దేవిప్రసాద్ చిత్ర విశేషాలను వివరిస్తూ 'పూర్తి స్థాయి హాస్యభరితంగా రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. వినోదాత్మకంగా సాగుతూ ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బనవ్విస్తుంది. థియేటర్‌లోకి వచ్చిన ప్రతీ ప్రేక్షకుడు నవ్వు ఆపుకోలేక 'కెవ్వుకేక' అనాల్సిందే. బ్లేడ్ బాబ్జీ తర్వాత మా కాంబినేషన్లో వచ్చే బెస్ట్ కామెడీ చిత్రం అవుతుంది' అన్నారు.
నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ ''ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న చిత్రమిది. త్వరలోనే ఆదిత్య మ్యూజిక్ ద్వారా పాటలను విడుదల చేస్తాం. జూన్ నెలలోనే చిత్రాన్ని ప్రేక్షకులకు అందించేందుకు ప్రయత్నిస్తున్నాం' అని చెప్పుకొచ్చారు.
ఈ చిత్రానికి కథ: వేగేశ్న సతీష్, దేవిప్రసాద్, మాటలు: వేగేశ్న సతీష్, సంగీతం: చిన్ని చరణ్-్భమ్స్, ఎడిటింగ్: నందమూరి హరి, కెమెరా: ఎ.విజయ్‌కుమార్, ఆర్ట్: కె.వి.రమణ, డ్యాన్స్: ప్రేమ్క్ష్రిత్, భాను, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు, సమర్పణ: నీలిమ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: దేవిప్రసాద్.


Click it and Unblock the Notifications












