కేపీ చౌదరి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు.. టాలీవుడ్ నటుల పేర్లు బయటకు!
టాలీవుడ్ ను కుదిపేస్తున్న మత్తు దందాలో ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నాయి. కబాలి తెలుగు సినిమా నిర్మాత కేపీ చౌదరి విచారణలో విస్తపోయే విషయాలు వెలుగులోకి రావడం కలకలం రేపుతున్నాయి. కేపీ చౌదరి రిమార్డు రిపోర్టులో విస్తూపోయే వాస్తవాలు బయటకు వచ్చినట్లు తెలుస్తోంది.
అందులో సినీ,రాజకీయ ప్రముఖులు కేపీ చౌదరి దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్‌లో వారి పేర్లను పోలీసులు పొందుపర్చారు. 12 మంది వెండితెర, బుల్లితెర నటులు, వ్యాపారులు.. కొకైన్ కొన్న వారిలో ఉన్నారని తేల్చారు. వివరాల్లోకి వెళ్తే...

షేక్ అవుతున్న టాలీవుడ్: సినీ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసు విచారణలో విస్తూపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల విచారణలో కీలక విషయాలు బయటకు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ డ్రగ్స్ కేసులో సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నేతల కుమారులు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. కేపీ చౌదరి వారందరికీ డ్రగ్స్ విక్రయించినట్లు పోలీసుల విచారణలో తేలింది. ప్రస్తుతం కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్ తో టాలీవుడ్ మొత్తం షేక్ అవుతుంది.
గూగుల్ డ్రైవ్ లో ఫోటోలు: ఇక కేపీ చౌదరి రిమాండ్ రిపోర్ట్ లో 12 మంది డ్రగ్స్ పెడ్లర్లు ఉండగా.. ఆరుగురు డ్రగ్స్ కన్‌స్యూమర్స్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. పోలీసులు వారి డాటాను విడుదల చేశారు. అందులో ముఖ్యంగా రఘుతేజ పేరు కీలకంగా వినిపిస్తోంది. అతనితో పాటు అషూ రెడ్డి సహా ప్రముఖుల పేర్లు ఉన్నట్లు సమాచారం. కేపీ చౌదరి గూగుల్ డ్రైవ్ లో 9వేలకు పైగా ఫొటోలు ఉండగా... వాటిలో ఎక్కువగా సెలబ్రిటీలతో దిగినవే ఉన్నట్లు పోలీసులు బయటపెట్టారు.

అషూరెడ్డితో వందల కాల్స్: కేపీ చౌదరి... ప్రతీరోజు వాళ్లతో కాల్స్ మాట్లాడే వారని గుర్తించారు. సినిమా సెలబ్రిటీలు అషురెడ్డి, సురేఖవాణి, జ్యోతితో చాలా కాల్స్ ఎక్స్‌చేంజ్ అయినట్లు కూడా గుర్తించారు. ఈ కాల్స్ ఎందుకు చేశారు? దేనికోసం అనేదానిపైనే ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా అషురెడ్డితో కేపీ రెడ్డి వందల కాల్స్ మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. వీరి మధ్య జరిగిన సంభాషణపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
కీలకంగా మారిన బ్యాంక్ లావాదేవీలు: అయితే కొన్ని రోజుల క్రితం వీరంతా కలిసి ఓ పార్టీ చేసుకున్నట్లు పోలీసులు తేల్చారు. అయితే అక్కడ కేపీ చౌదరి డ్రగ్స్ విక్రయించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీలో పాల్గొన్న వారంతా సెలబ్రెటీలు కాగా.. అక్కడ చాలా మంది డ్రగ్స్ ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మొత్తం డ్రగ్స్ వ్యవహారంలో .. ఫోన్‌కాల్స్, బ్యాంక్ లావాదేవీలు కీలకంగా మారాయి. పలువురికి బ్యాంకు అకౌంట్ల ద్వారా చెల్లింపులు జరిపినట్లు తెలుస్తోంది. చూడాలి ఇక ఈ కేసులో ఇంకా ఎవరి పేర్లు బయటకు రానున్నాయో.


Click it and Unblock the Notifications











