అరవింద సమేత కథ ఇదే.. ఎన్నో సినిమాలు వచ్చాయి, త్రివిక్రమ్ అందుకే స్పెషల్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వస్తున్న తొలి చిత్రం అరవింద సమేత. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్ 11 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. అరవింద సమేత చిత్రంపై ఎన్టీఆర్ అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. హిట్ ఖాయమనే పాజిటివ్ బజ్ చిత్రానికి నెలకొని ఉంది. అరవింద సమేత టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర కథ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఎన్నో చిత్రాలు వచ్చాయి

ఎన్నో చిత్రాలు వచ్చాయి

అరవింద సమేత చిత్రం ఫ్యాక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న సంగతి తెలిసిందే. రాయల సీమ ఫ్యాక్షన్ గురించి గతంలో బోలెడు చిత్రాలు వచ్చాయి. ఫ్యాక్షన్ నేపథ్యంతో కూడుకున్న కథలు మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా ఉంటాయి. ఈ కాలం ఆడియన్స్ ని ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ స్టోరీ మెప్పించాలంటే అందులో ప్రత్యేకత తప్పనిసరి.

Recommended Video

Aravindha Sametha Movie Working Stills Goes Viral
కథ ఇదే

కథ ఇదే

అరవింద సమేత చిత్ర కథ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో భయంకరమైన యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు అంతకు మించిన ఎమోషన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్యాక్షన్ లీడర్లు అల్లర్లు సృష్టిస్తే దానివలన ఎంతమంది తల్లులు, భార్యలు, అక్క చెల్లెల్లు నష్టపోతారో ఈ చిత్రంలో త్రివిక్రమ్ చూపించబోతున్నాడట.

అదే త్రివిక్రమ్ ప్రత్యేకత

అదే త్రివిక్రమ్ ప్రత్యేకత


ఫ్యాక్షన్ అంటే భీకరమైన రక్తపాతం మాత్రమే కాదు.. ఇంట్లో ఆడవాళ్ళ యాంగిల్ లో కూడా కథని నడిపించవచ్చని త్రివిక్రమ్ శ్రీనివాస్ భావించి అరవింద సమేత చిత్ర కథని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. అందరికంటే భిన్నంగా ఆలోచించడమే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేకత అని సినీవర్గాలు అంటున్నాయి.

పవర్ ఫుల్ డైలాగ్స్

పవర్ ఫుల్ డైలాగ్స్


ఆడవాళ్ళ యాంగిల్ లో త్రివిక్రమ్ శ్రీనివాస్ చూపించబోతున్న ఈ ఫ్యాక్షన్ కథలో డైలాగ్స్ కట్టిపడేసేలా ఉంటాయని అంటున్నారు. ఎమోషన్ ని బాగా హైలైట్ చేసినట్లు తెలుస్తోంది. రాయలసీమ యాసలో త్రివిక్రమ్ రాసిన డైలాగ్స్ ఆడియన్స్ ని థ్రిల్ చేసేలా ఉంటాయని సమాచారం.

సందడి మొదలు

సందడి మొదలు


అక్టోబర్ 11 న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో అప్పుడే సందడి మొదలైంది. అక్టోబర్ 2 న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. పూజ హెగ్డే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. జగపతి బాబు, నాగబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X