twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF 2 భారీ డీల్.. యష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్.. సౌత్ శాటిలైట్ హక్కులన్నీ ఆ ఛానెల్‌కే!

    |

    బాహుబలి అనంతరం పాన్ ఇండియా అనే స్థాయిలో మంచి విజయాన్ని అందుకున్న సినిమాలలో KGF మొదటి చాప్టర్ అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ముగింపుగా రాబోతున్న చాప్టర్ 2 పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కన్నడ స్టార్ యష్ నటిస్తున్న ఈ సినిమాను యువ దర్శకుడు ప్రశాంత్ నీల్ అంచనాలకు తగ్గట్లుగా తెరకెక్కించాడు. మొత్తానికి సినిమా షూటింగ్ అయితే పూర్తయింది. ఇక ఈ ఏడాది సమ్మర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే.

    భారీ స్థాయిలో బిజినెస్

    భారీ స్థాయిలో బిజినెస్

    మొత్తానికి ఒక రిలీజ్ డేట్ అయితే ఫిక్స్ చేసుకున్నారు. కాని సినిమా అదే డేట్ కు వస్తుందా లేదా అనేది కూడా పెద్ద సందేహం గానే ఉంది. ఇక సినిమాకు సంబంధించిన బిజినెస్ డీల్స్ అయితే దాదాపు క్లోజ్ అయ్యాయి. KGF పార్ట్ వన్ కంటే కూడా సెకండ్ చాప్టర్ పై అంచనాలు భారీ స్థాయిలో ఉండడంతో బిజినెస్ అయితే గట్టిగానే జరిగింది. నిర్మాతలకు రిలీజ్ బిజినెస్ తోనే టేబుల్ ప్రాఫిట్ దక్కడం విశేషం.

     సొంతం చేసుకున్న జీ సంస్థ

    సొంతం చేసుకున్న జీ సంస్థ

    చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేయడం ఖాయం అని అర్థమవుతోంది. పోటీగా పెద్ద సినిమాలు వచ్చినా కూడా KGF చాప్టర్ 2 భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకుంటుందని బాక్సాఫీస్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన సౌత్ టెలివిజన్ హక్కులను జీ ఛానెల్ సంస్థ సొంతం చేసుకుంది. కన్నడ తమిళ్ తెలుగు మలయాళం భాషలకు సంబంధించిన శాటిలైట్ హక్కులను భారీ ధరకు జీ సంస్థ కొనుగోలు చేసినట్లు గత కొన్ని రోజులుగా అనేక రకాల వార్తలు వస్తున్నాయి.

    క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

    క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

    ఈ విషయంపై చిత్ర నిర్మాత విజయ్, దర్శకుడు ప్రశాంత్ నీల్ అఫీషియల్ గా క్లారిటీ కూడా ఇచ్చేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాకు భారీ డీల్స్ దక్కడం ఇదే మొదటిసారి. శాటిలైట్ డిజిటల్ ఆడియో రైట్స్ రూపంలో అత్యధిక లాభాలను అందుకున్న KGF చాప్టర్ 2 ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో లాభాలు అందుకుంటుందని ప్రేక్షకుల్లో కూడా గట్టి నమ్మకం అయితే ఉంది.

    Recommended Video

    Yash, Puri Jagannadh To Team Up For A Political Thriller || Filmibeat Telugu
    సినిమా రిలీజ్ ఎప్పుడంటే

    సినిమా రిలీజ్ ఎప్పుడంటే

    ఇక సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మొదట ఒక ప్లాన్ చేసుకున్నారు. పోటీగా పెద్ద సినిమాలు ఉండటంతో కాస్త ముందుగానే క్రిస్మస్ కు విడుదల చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నారు. కానీ ఆ సమయంలో మరొక పాన్ ఇండియా మూవీ పుష్ప 1 కూడా భారీగా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో రానున్న ఆ సినిమాపై కూడా అంచనాలు గట్టిగానే ఉన్నాయి. మరి చాప్టర్ 2 ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

    English summary
    KGF 2 movie south languages satellite rights deal closed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X