KGF 2: ఎనిమిదేళ్ళ రక్తం, శ్రమ, కన్నీళ్లతో వచ్చాం..దయచేసి అలా చేయకండి ప్లీజ్
మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమాలలో ఒకటైన KGF చాప్టర్ 2 అనేక వాయిదాల తరువాత ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఒక రకంగా కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్ చేస్తున్నారు అనగానే ఈ సినిమా కోసం అభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారు అనేది చెప్పాల్సిన పని లేదు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన KGF చాప్టర్ 1 క్రియేట్ చేసిన రికార్డులు అయితే ఒకటీ రెండూ కాదు. అయితే సినిమా సీక్వెల్ ప్రేక్షకుల ముందుకి వచ్చిన క్రమంలో ఆ సినిమా యూనిట్ ఒక స్పెషల్ నోట్ విడుదల చేసింది. ఆ వివరాలు

భారీ అంచనాలు
భారీ బడ్జెట్‌తో రూపొందిన 'కేజీఎఫ్ చాప్టర్ 2' మూవీలో యశ్ హీరోగా నటించగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది.ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. రవి బస్రూర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవి బశ్రూర్ సంగీతం అందించిన ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

కరోనా సమయంలో
నిజానికి మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం చేస్తామని అప్పట్లో ప్రకటించారు. అలా ప్రారంభమైన 'KGF చాప్టర్ 2' సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులే అయినా కారోనా లాంటి అనేక కారణాలతో అనుకున్న సమయానికి దీన్ని పూర్తి చేయ లేదు. అయితే అలాంటి పరిస్థితుల్లో దీంతో ఈ సినిమాను గత ఏడాదే డిసెంబర్‌లోనే విడుదల చేస్తారని వార్తలు వచ్చినా కోవిడ్ సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడ లేదు.

ఐదు భాషలలో
ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను 2022, ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తామని చెప్పి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. కన్నడతో పాటు తెలుగు, హిందీ, మలయాళం భాషల్లోనూ కేజీఎఫ్ రిలీజ్ అయింది. అయితే, లీకు రాయుళ్లు ఈ మధ్యన అన్ని సినిమాలను పైరసీ చేసి సోషల్ మీడియాలో సినిమాకు సంబంధించిన వీడియో ఫుటేజ్ లను లీక్ చేసి మేకర్స్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు.

RRR కు తప్పలేదు
ఈ మధ్య ఎన్నో అంచనాలతో విడుదలైన RRR సినిమాని యూట్యూబ్ లో పెట్టేశారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలా చేయడం వలన ఒకపక్క అభిమానులు, మరోపక్క మేకర్స్ కూడా బాధ పడాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో కేజీఎఫ్ విడుదల అయిన నేపథ్యంలో మేకర్స్ ఒక స్పెషల్ నోట్ విడుదల చేశారు.

వీడియోలు తీయొద్దు
ఎనిమిదేళ్ళ రక్తం, శ్రమ, కన్నీళ్లతో కేజీఎఫ్ ఫ్రాంచైజ్ ను రూపొందించాము. సినిమాల్లో KGF 2 చూస్తున్నప్పుడు వీడియోలు తీసుకోవద్దని వాటిని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయవద్దని మేము మీ అందరినీ కోరుతున్నాము. KGF యొక్క గ్రాండియోస్‌ను మనం అందరం సినిమాల్లో మాత్రమే అనుభవిద్దాం, థియేటర్‌లలో చూడటానికి వేచి ఉన్న ఇతరుల ఆనందాన్ని మనం ఇలా లీకులు ఇచ్చి పాడు చేయకూడదు.
అలాగే అందరూ థియేటర్ల లోనే కేజీఎఫ్ 2 చిత్రం చూసేలా సహకరించమని పోస్ట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు పైరసీ మీ దృష్టికి వస్తే మా దృష్టికి తీసుకు రమ్మని కోరారు. దానికి లింకులు కూడా ఇచ్చారు.


Click it and Unblock the Notifications











