twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF 2 తెలుగు రైట్స్: ఒక్క సిట్టింగ్‌లో డీల్ క్లోజ్ చేసిన దిల్ రాజు

    |

    టాలీవుడ్ ఇండస్ట్రీలో భాషతో సంబంధం లేకుండా కలెక్షన్స్ అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. కంటెంట్ బావుంటే మన ఆడియెన్స్ సపోర్ట్ చేసినంతగా మరే భాషలో సపోర్ట్ చేయారనే చెప్పాలి. తమిళ్ డబ్బింగ్ సినిమాలకు ఇక్కడ మార్కెట్ వాల్యూ ప్రతి ఏడాది పెరుగుతూనే ఉంది. త్వరలోనే రాబోయే KGF 2 తెలుగు డబ్బింగ్ హక్కులకు కూడా డిమాండ్ గట్టిగానే పెరిగింది. ఇక తెలుగు ధర చూసి చాలా మంది భయపడి పోగా ఒక్క దిల్ రాజు మాత్రమే తెగించి ముందడుగు వేసినట్లు తెలుస్తోంది.

    Recommended Video

    KGF Chapter 2 Demand In Tollywood | Filmibeat Telugu

    నైనా గంగూలీ బోల్డ్ ఫోటోషూట్. ఎద అందాలతో మరింత ఆకర్షణీయంగా

    అందరిచూపు KGF 2 పైనే..

    అందరిచూపు KGF 2 పైనే..

    పాన్ ఇండియా అంటే చాలు బాక్సాఫీస్ వద్ద లోకల్ సినిమాల కంటే హై రేంజ్ లో 100కోట్ల వసూళ్లను అందుకుంటున్నాయి. ఇక నెక్స్ట్ అందరిచూపు KGF 2 పైనే ఉంది. ఆ సినిమాను ఇతర భాషల్లో ఎవరు రిలీజ్ చేసినా కూడా ముందుగా పెట్టిబడి మాత్రం గట్టిగానే పెట్టాల్సి ఉంటుంది. ఊహలకు అందని ధరకు రిలీజ్ రైట్స్ ను దక్కించుకోవాల్సిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా చాలా చోట్ల బిజినెస్ డీల్స్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.

    చాప్టర్ 1తో కోట్లు దండుకున్న వారాహి

    చాప్టర్ 1తో కోట్లు దండుకున్న వారాహి

    ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన KGF చాప్టర్ 1లో యష్ హీరోయిజం ఆడియెన్స్ కు బాగా ఎక్కేసింది. ఆ సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. యష్ నటించిన ఈ సినిమాపై మొదట్లో పెద్దగా అంచనాలు లేవు. ఇక తెలుగులో నెగిటివ్ రివ్యూలు వచ్చినా కలెక్షన్స్ తక్కువేమి రాలేదు. వారాహి చలన చిత్రం నిర్మాతలు తెలుగు హక్కులను 5కోట్లకు అందుకొని 12కోట్లకుపై లాభాలను అందుకున్నారు.

    డిమాండ్ ఎక్కువవ్వడంతో

    డిమాండ్ ఎక్కువవ్వడంతో

    బాక్సాఫీస్ వద్ద KGF చాప్టర్ 1 మొత్తానికి బాగానే క్లిక్కయ్యింది. అయితే ఆ తరువాత సినిమా అమెజాన్ ప్రైమ్ లో భారీ స్థాయిలో క్రేజ్ ను అందునుంది. అత్యదిక వ్యూవ్స్ అందుకున్న టాప్ సినిమాల్లో KGF చాప్టర్ 1 నిలవడంతో ఇప్పుడు ఆ ప్రభావం చాప్టర్ 2 మార్కెట్ కు కలిసొచ్చింది. పైగా ఇటీవల విడుదలైన టీజర్ కు అత్యదిక వ్యూవ్స్ రాగా అందులో తెలుగు తెలుగు ఆడియెన్స్ నుంచి కూడా భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఇక డిమాండ్ ఎక్కువవ్వడంతో ఈసారి వారాహి పోటీ నుంచి తప్పుకుంది.

    దిల్ రాజు ఒక్కడే..

    దిల్ రాజు ఒక్కడే..

    చాలా మంది అగ్ర నిర్మాతలకు KGF 2పై నమ్మకం ఉంది గాని ఒకేసారి వాళ్ళు అడిగినంత ఇవ్వలేకపోతున్నారు. మొదట 50కోట్లు అనే ఊహాగానాలు వచ్చినప్పుడే గుండెలు పట్టుకున్న వారు ఇప్పుడు అసలైన రేట్ గురించి విని వెనుకడుగు వేస్తున్నారు. ఇక దిల్ రాజు ఒక్కడే సినిమా హక్కులను అందుకునేందుకు రెడీ అయినట్లు టాక్.

    మరో 5కోట్లు తగ్గించి..

    మరో 5కోట్లు తగ్గించి..

    ఇక KGF చాప్టర్ 2 మార్కెట్ కూడా ఊహాలకందని రేంజ్ కు వెళ్లేలా ఉంది. అప్పట్లో చాప్టర్ 1 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 5కోట్ల ధర పలుకగా ఇప్పుడు చప్టార్ 2 కోసం 65కోట్లకు డీల్ సెట్టయినట్లు సమాచారం. ముందు 70కోట్లకు చేబితే రాజుగారు దాంట్లో మరో 5కోట్లు తగ్గించి డీల్ క్లోజ్ చేయించినట్లు సమాచారం. అడ్వాన్స్ కూడా ఇచ్చేశారని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో దిల్ రాజు ఏ రేంజ్ లో ప్రాఫిట్స్ అందుకుంటారో చూడాలి.

    English summary
    It is not uncommon for a Kannada film to receive Pan India level for the first time. KGF Cinema has overturned all those ideas at a time when it would be great to have a market of 50 crores. The latest blockbuster product from Chapter 1 has just hit the shelves. Fans are eagerly awaiting the success of the film as never before
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X