twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కెజిఎఫ్ నటుడితో పెళ్లి.. ఊహించని షాక్ ఇచ్చిన బిగ్‌బాస్ పూజ రామచంద్రన్!

    |

    Recommended Video

    Pooja Ramachandran Marries KGF Actor Anish John Kokken || Filmibeat Telugu

    నటి పూజా రామచంద్రన్ స్వామిరారా చిత్రంతో తెలుగులో గుర్తింపు దక్కించుకుంది. పలు చిత్రాల్లో పూజా నటించనుంది. తెలుగు, తమిళ భాషల్లో పూజ రామచంద్రన్ పలు చిత్రాల్లో నటించింది. కానీ కెరీర్ వేగం పెంచే పాత్రలు మాత్రం చేయలేదు. గత ఏడాది తెలుగు బిగ్ బాస్ షో ద్వారా మరింత పాపులర్ అయింది. తెలుగు బిగ్ బాస్ 2 లో హైలైట్ గా నిలిచిన కంటెస్టెంట్స్ లో పూజ రామచంద్రన్ ఒకరు. పూజా రామచంద్రన్ తన ప్రియుడిని వివాహం చేసుకుని ఊహించని షాక్ ఇచ్చింది.

     రిలేషన్ షిప్‌లో

    రిలేషన్ షిప్‌లో

    పూజా రామచంద్రన్, ప్రముఖ నటుడు అనీష్ జాన్ కొక్కెన్ గత కొంత కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. అనీష్ పలు చిత్రాల్లో నెగిటివ్ రోల్స్ చేస్తూ మెప్పిస్తున్నాడు. ఇటీవల అనీష్ బాహుబలి, కెజిఎఫ్ లాంటి చిత్రాల్లో నటించాడు. కెజిఎఫ్ చిత్రంలో అతడి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సోమవారం రోజు ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు.

    నా బెస్ట్ ఫ్రెండ్

    నా బెస్ట్ ఫ్రెండ్

    తాను, అనీష్ వివాహం చేసుకున్న సంగతిని పూజా రామచంద్రన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. నా బెస్ట్ ఫ్రెండ్ అనీష్ ని వివాహం చేసుకున్నా. ప్రస్తుతం కేరళలో విషు పర్వదినం కొనసాగుతోంది. మా పెళ్లి వార్తని ప్రకటించడానికి ఇంతకంటే మంచి సమయం ఉండదని భావిస్తున్నా. కేరళ సంప్రదాయంలో తమ వివాహం జరిగినట్లు పూజా రామచంద్రన్ తెలిపింది. పూజా రామచంద్రన్ పసుపు వర్ణంలోని చీరలో, అనీష్ పంచె కట్టులో వధూవరులు సంప్రదాయబద్ధంగా కనిపిస్తున్నారు.

     రెండో వివాహం

    రెండో వివాహం

    పూజా రాంచంద్రన్ వీడియో జాకీగా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత తన తోటి విజేగా పని చేస్తున్న ఓ వ్యక్తి ప్రేమలో పడి అతడిని వివాహం చేసుకుంది. కొంతకాలం తర్వాత పూజా అతడి నుంచి విడిపోయింది. దానికి కారణం తమ ఇద్దరి మధ్య మనస్పర్థలే అని పూజా రామచంద్రన్ గతంలో తెలిపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అనీష్ ప్రేమలో పడి ఇద్దరూ సహజీవనం చేయడం ప్రారంభించారు. అనీష్ కు కూడా ఇది రెండవ వివాహమే. గతంలో అనీష్ మీనా వాసుదేవన్ అనే నటిని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. 2016లో వీరిద్దరూ విడిపోయారు.

    వైల్డ్ కార్డు ఎంట్రీ

    వైల్డ్ కార్డు ఎంట్రీ

    గత ఏడాది జరిగిన తెలుగు బిగ్ బాస్ సీజన్ 2కి పూజా రామచంద్రన్ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రవేశించింది. పూజా రామచంద్రన్ హౌస్ లో ఉన్నన్ని రోజులు హైలైట్ గా నిలిచింది. పూజా రామచంద్రన్ స్వామి రారా, దోచేయ్, త్రిపుర లాంటి తెలుగు చిత్రాల్లో నటించింది.

    English summary
    KGF actor Anish John Kokken marries Priya Ramachandran. Multilingual actor John Kokken has married his sweetheart and actress Priya Ramachandran on Monday, 15 April.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X