twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    KGF నటుడు ఆకస్మిక మృతి... హాస్పిటల్ లో తుదిశ్వాస.. ఎలా చనిపోయారంటే?

    |

    సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది.. దక్షిణాది భాషలలో తనదైన శైలిలో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటుడు మోహన్ జునేజా అనారోగ్య కారణాలతో కన్నుమూసారు. స్వతహాగా కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ఆయన తమిళ, తెలుగు, కన్నడ మలయాళ భాషలలో కూడా సత్తా చాటారు. మరీ ముఖ్యంగా కన్నడ సినీ పరిశ్రమ నుంచి వచ్చి దేశవ్యాప్తంగా సత్తా చాటిన కేజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాలలో ఆయన కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆయన ఎలా మృతి చెందారు ? అనే వివరాల్లోకి వెళితే

    కన్నడనాట క్రేజ్

    కన్నడనాట క్రేజ్


    మోహన్ జునేజా కన్నడ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తుమకూర్‌కు చెందిన మోహన్ జునేజా సినిమాలలో నటించడం కోసం బెంగళూరు వచ్చి బెంగళూరులో నివసిస్తున్నాడు. మోహన్ యుక్తవయసులో ఎక్కువగా నాటక ప్రదర్శనలు ఇస్తూ ఉండే వాడు అలా ఆయన సినిమాల మీద కూడా చాలా ఆకర్షితుడయ్యాడు. దీంతో సినీ పరిశ్రమలో తన జీవితాన్ని కొనసాగించాలని భావించాడు. మోహన్ అనేక నాటకాలలో నటించి అందరి మెప్పు పొందాడు.

    సినిమాల మీద ఆసక్తితో

    సినిమాల మీద ఆసక్తితో

    2008లో వచ్చిన సంగమ అనే కన్నడ రొమాంటిక్ చిత్రంతో ఆయన నటుడిగా అరంగేట్రం చేశాడు. ఆ తరువాత మోహన్ జునేజా 2009లో వచ్చిన కన్నడ- తమిళ చిత్రం టాక్సీ నంబర్‌1లో నటించారు. మోహన్ 2010లో కన్నడ భాషా నాటకం 'నారద విజయ'లో అలాగే అరేత అనే నాటకంలో కూడా నటించాడు. మోహన్ జునేజా 2012లో కోకో, స్నేహితారు చిత్రాలలో నటించారు. మోహన్ 2013లో లక్ష్మి, పాడే పదే, బృందావనం, కుంభ రాశి మరియు స్వీటీతో సహా అనేక చిత్రాలలో కనిపించారు.

    ఎప్పటికీ గుర్తుంచుకుంటారు

    ఎప్పటికీ గుర్తుంచుకుంటారు


    మోహన్ కెరీర్‌లో భారీ బ్రేక్‌ను అందించిన 'చెల్లాట'లో అతని పాత్రను ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఇక మోహన్ వితారాతో సహా పలు సీరియల్స్‌లో కూడా కనిపించాడు, సీరియల్స్ ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేశాయి అని చెప్పాలి. ఇక ఆయన మృతి పట్ల అభిమానులు, శాండల్‌వుడ్ వర్గాల సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. మోహన్ జునేజా గత కొద్ది రోజులుగా కాలేయ వ్యాధితో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఈ అనారోగ్య కారణంతో ఆయనను చిక్కబాణవర సప్తగిరి ఆసుపత్రిలో జాయిన్ చేయగా ఆయన అక్కడే చికిత్స పొందుతూ 7న మరణించాడు.

    కేజిఎఫ్ సిరీస్తో సూపర్ క్రేజ్

    కేజిఎఫ్ సిరీస్తో సూపర్ క్రేజ్


    మోహన్ జునేజా కన్నడలో వందకుపైగా సినిమాలో నటించారని తెలుస్తోంది. ఈ మధ్యే విడుదలైన KGF చాప్టర్ 2, ఆ సినిమా మొదటి భాగము KGF చాప్టర్ 1 లో కూడా మోహన్ జునేజా ప్రధాన పాత్రలో నటించారు. కథ మొత్తాన్ని వివరించే పాత్రకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వ్యక్తిగా ఆయన నటించాడు. మాన్స్టర్ అనే పదం కూడా ప్రశాంత్ నీల్ మోహన్ నోటి నుంచి పలికించారు. చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్ కువెన్నునొప్పి రావడంతో కుటుంబ సభ్యులు చిక్కబాణవరంలోని సప్తగిరి ఆస్పత్రిలో చేర్చారు.

    అంత్యక్రియలు ఎప్పుడంటే

    అంత్యక్రియలు ఎప్పుడంటే

    చికిత్స పొందుతూ.. శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మోహన్‌కు తల్లి, భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన స్వస్థలం తుముకూరు అయినా సరే కుటుంబమంతా బెంగళూరులోనే స్థిరపడడంతో ఆయన అంత్యక్రియలు కూడా బెంగళూరులోనే జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన మృతితో కన్నడ సినీ పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. కన్నడ సినీ పరిశ్రమ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

    English summary
    Actor and comedian Mohan Juneja has passed away on May 07 morning in Bengaluru. His last rites will be performed same day.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X