KGF Chapter 2 twitter review.. సిల్వర్ స్క్రీన్‌పై ప్రశాంత్ నీల్ మ్యాజిక్.. KGF Chapter 1 కి మించి..

భారతీయ సినిమా రంగంలో KGF Chapter 2 సినిమా కోసం నాలుగేళ్లుగా వేచి చూసిన ఎదురు చూపులు ముగిసాయి. అనేక వాయిదాల అనంతరం ఈ చిత్రం ఏప్రిల్ 14 తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి లండన్, బెంగళూరు, ముంబై నగరాల్లో స్పెషల్ ప్రీమియర్స్ ప్రదర్శించారు. ఈ సినిమాకు సంబంధించిన తొలి టాక్ ట్విట్టర్ మీడియాలో మోత మోగుతున్నది. ఈ సినిమాపై టాక్ నెటిజన్ల పోస్టులు ఇలా ఉన్నాయి. నెటిజన్ల ట్విట్టర్ రివ్యూలోకి వెళితే..

Recommended Video

KGF Chapter 2 Review ఫస్టాఫ్ ని మించి సెకండాఫ్ | Filmibeat Telugu

ఇంటర్వెల్ రోమాలు నిక్కబొడుచుకొనే విధంగా

KGF Chapter 2 మూవీ ఫస్టాప్ వెరి గుడ్. యష్ ఎంట్రీ సీన్, ఇంటర్వెల్ సన్నివేశంతో రోమాలు నిక్కబొడుస్తాయి. కథ ఈ సినిమాకు మరింత బలంగా మారింది. బీజీఎం మరొ లెవెల్‌లో ఉంది అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

యష్ యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్

KGF Chapter 2 సినిమాకు సంబంధించిన నా రివ్యూ ఇదే.. నా రేటింగ్ 4/5. యష్ యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్. స్టోరీలైన్ మైండ్ బ్లోయింగ్, యాక్షన్ సీన్లు, సాంగ్స్ బీజీఎం అద్భుతం. కొన్ని సీన్లు బాగాలేవు. కానీ సినిమాపై అంతగా ప్రభావం చూపవు అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.

సంజయ్ దత్ ఎంట్రీ

అధీరాగా సంజయ్ దత్ ఎంట్రీ అదిరిపోయింది. అతడి కెరీర్‌తోపాటు ఇండియన్ సినిమాలోనే బెస్ట్ సీన్లలో ఒకటి. ప్రశాంత్ నీల్ విజన్ బ్రిల్లియంట్. సంజయ్ దత్ టాలెంట్‌ను ప్రశాంత్ నీల్ అద్బుతంగా ఉపయోగించుకొన్నాడు. సంజయ్ దత్ తన ఫ్యాన్స్ తల ఎత్తుకొనే విధంగా సినిమా ఉంటుంది. బీజీఏం మరో లెవెల్‌లో ఉంది అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

KGF Chapter 2 మూవీ రిపోర్ట్ ఏమిటంటే

KGF Chapter 2 మూవీ రిపోర్ట్ ఏమిటనే విషయాన్ని తెలుసుకోవడానికి అందరూ మేల్కొని ఉన్నారు. కేజీఎఫ్ 2 ఒక సినిమా కానే కాదు.. ఓ ఎమోషన్ అంటూ మరో నెటిజన్ పోస్టు పెట్టాడు.

తుఫాన్ పాట బిల్డప్

KGF Chapter 2 మూవీలో తుఫాన్ పాటకు బిల్డప్ అదిరిపోయింది. సినిమాలో పాట చిత్రీకరణ హై క్లాస్ రేంజ్‌లో ఉంది. మాంటేజ్ విజువల్స్ కేక పెట్టించాయి అని అభిమాని ట్వీట్ చేశారు.

KGF Chapter 2 మూవీ హైప్

KGF Chapter 2 మూవీ హైప్ తగినట్టుగా లేదు. రెగ్యులర్‌గా ఉండే ఔట్ డేటేడ్ మసాలా చిత్రం. కథ అందరూ ఊహించినట్టే ఉంటుంది. కథలో ఇంటెన్సిటీ మాత్రమే పాజిటివ్ పాయింట్. కేజీఎఫ్ 1 మాదిరి మ్యాజిక్ క్రియేట్ చేయడంలో ప్రశాంత్ నీల్ ఫెయిల్ అయ్యాడు అని ఓ నెటిజన్ పోస్టు పెట్టాడు. సినిమాకు 2 రేటింగ్ ఇవ్వడం షాకింగ్‌గా మారింది.

యష్ ఎంట్రీ సీన్

యష్ ఎంట్రీ సీన్

KGF Chapter 2 ఎంట్రీ సీన్ చాలా బాగుంది. ఫ్యాన్స్ ఊగిపోయేంతగా యష్ ఎంట్రీ ఉంది. ఈ సినిమాకు నా రేటింగ్ 4/5 అంటూ ఓ నెటిజన్ ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు.

KGF Chapter 2 ఫస్టాఫ్

KGF Chapter 2 ఫస్టాఫ్

KGF Chapter 2 ఫస్టాఫ్ అదిరిపోయింది. యష్ బాస్ స్క్రీన్ ప్రజెన్స్, బీజీఎం, సినిమాటోగ్రఫి బాగుంది అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X