For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  KGF Chapter 2 రిలీజ్ డేట్ ప్రకటన: అప్పటి వరకూ ఆగాల్సిందే.. ప్రభాస్ కొత్త సినిమా కూడా వాయిదా!

  |

  కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి విడుదలై.. దేశ వ్యాప్తంగా ఎనలేని క్రేజ్‌ను అందుకున్న చిత్రం 'KGF Chapter 1'. రాకింగ్ స్టార్ యశ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం ఐదు భాషల్లో విడుదలైంది. అన్ని చోట్లా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే సమయంలో కలెక్షన్ల సునామీని సృష్టించింది. అలాగే, జాతీయ అవార్డులను సైతం అందుకుంది. ఇంతటి ఘన విజయాన్ని దక్కించుకున్న ఈ సినిమాకు సీక్వెల్ కూడా వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. దీంతో ప్రభాస్ సినిమా వాయిదా పడబోతుంది. ఆ సంగతులు మీకోసం!

  రాఖీ భాయ్ మళ్లీ వస్తున్నాడు

  రాఖీ భాయ్ మళ్లీ వస్తున్నాడు

  రాకింగ్ స్టార్ యశ్.. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌ ‘KGF Chapter 1' సీక్వెల్‌గా వస్తున్న చిత్రమే ‘KGF Chapter 2'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని హొంబళే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో విలన్ అధీరాగా సంజయ్ దత్ నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.

  Happy Birthday Chiranjeevi: చిరంజీవి డైరెక్ట్ చేసిన ఏకైక సినిమా.. ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్

  కేజీఎఫ్‌ నేషనల్ రికార్డులు బ్రేక్

  కేజీఎఫ్‌ నేషనల్ రికార్డులు బ్రేక్

  గత జనవరిలో యశ్ పుట్టినరోజు సందర్భంగా ‘KGF Chapter 2' టీజర్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అన్ని భాషలకూ కలిపి ఒకే వీడియోను విడుదల చేశారు. దీంతో ఈ టీజర్‌కు అన్ని భాషల ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా దీనికి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. దీంతో ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఉన్న ఎన్నో రికార్డులు బద్దలైపోయాయి.

  రిలీజ్ వాయిదా.. బిజినెస్ అలా

  రిలీజ్ వాయిదా.. బిజినెస్ అలా

  టీజర్‌తో ‘KGF Chapter 2' మూవీపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దీంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. అన్ని ఏరియాల హక్కులు రికార్డు ధరలకు అమ్ముడయ్యాయి. దీంతో దీన్ని ఎంతో గ్రాండ్‌గా విడుదల చేయాలని భావించారు. కానీ, కరోనా ప్రభావం కారణంగా ఈ సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రాలేకపోయింది.

  బోల్డు షోతో రెచ్చిపోయిన అనుపమ పరమేశ్వరన్: అలా తీసిన ఫొటోలో అందాల అరబోత

  కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్

  కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన టీమ్

  ‘KGF Chapter 2'పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకే ఈ మూవీ ఎప్పుడు విడుదల అవుతుందా అని సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో దీన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా ప్రకటించింది. అంటే ఈ సినిమాను చూడాలంటే మరింత కాలం వేచి చూడాల్సిందే.

  ప్రభాస్ ‘సలార్’ కూడా అదే రోజు

  ప్రభాస్ ‘సలార్’ కూడా అదే రోజు


  యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘సలార్'. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మూవీని కూడా హొంబళే సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది.

  టాప్‌ను కిందకు జరిపి షాకిచ్చిన భూమిక: మరీ ఇంత ఘాటుగానా.. ఆమెనిలా చేస్తే తట్టుకోలేరు!

  ప్రభాస్ సలార్ వాయిదా పడిందా

  ప్రభాస్ సలార్ వాయిదా పడిందా

  ఇప్పుడు ‘KGF Chapter 2' మూవీని ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడంతో.. ప్రభాస్ నటిస్తోన్న ‘సలార్' మూవీ వాయిదా పడిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. దీన్ని వెనక్కి జరపడం వల్లే కేజీఎఫ్‌ను ఆరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సలార్ వాయిదా పడిన విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తారని టాక్.

  15 Songs That Helps To Overcome Depression | Best Sufi Songs | Filmibeat Telugu
  యశ్ ఫ్యాన్స్ ఖుషీ.. ప్రభాస్ ఫ్యాన్స్?

  యశ్ ఫ్యాన్స్ ఖుషీ.. ప్రభాస్ ఫ్యాన్స్?

  ‘KGF Chapter 2' మూవీని వచ్చే ఏడాది విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడంపై ఆ సినిమా హీరో యశ్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. అదే సమయంలో ‘సలార్' వాయిదా పడబోతుందన్న వార్తలతో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆందోళన చెందుతున్నారు. దీంతో రెండు ఇండస్ట్రీల్లోనూ ఈ న్యూస్ విపరీతంగా హాట్ టాపిక్ అవుతోంది.

  English summary
  K.G.F: Chapter 2 is Kannada High Budget Film. This Movie Release on 14th April 2022. Also Prabhas Salaar Movie will be Postpone.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X