KGF డైరెక్టర్ పవర్ఫుల్ లైనప్.. మరో ఐదేళ్లు మనవాళ్ళతోనే

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టులు సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఒకప్పుడు మన స్టార్ హీరోలు ఒక సినిమాను స్టార్ట్ చేశాక ఏడాది గడిస్తే గానీ మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు కాదు. ఒక సినిమా అయిపోతే గాని మరొక సినిమాను అంత తొందరగా స్టార్ట్ చేసేవారు కాదు. చాలా నిదానంగా వెళ్లే అగ్రహీరోలు ఇప్పుడు మాత్రం గ్యాప్ లేకుండా ఒకే ఏడాదిలో మూడు సినిమాలను సెట్స్ పైకి తేవడమే కాకుండా ఏకంగా లైన్లో పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారు. దానికి తోడు దర్శకులు కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తున్నారు. సౌత్ లోనే కాకుండా ఇండియా మొత్తంలో కూడా మంచి డిమాండ్ ఉన్న దర్శకుల్లో ప్రశాంత్ నీల్ తన స్థాయిని అంతకంతకూ పెంచుకుంటున్నాడు.

హీరో కంటే ఎక్కువ ఆఫర్స్

హీరో కంటే ఎక్కువ ఆఫర్స్

కన్నడ స్టార్ హీరో యష్ తీసిన కే జి ఎఫ్ చాప్టర్ 1 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకున్న ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఆ సినిమా తర్వాత దర్శకుడి స్థాయి కూడా మరో లెవెల్ కి వెళ్ళింది. ఒక విధంగా హీరో యష్ కంటే కూడా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు ఆఫర్స్ ఎక్కువగా వస్తున్నాయి. ప్రశాంత్ మళ్లీ కేజిఎఫ్ చాప్టర్ 2 తో కూడా మరో బాక్సాఫీస్ హిట్ అందుకోగలరని ఇప్పటికే టీజర్ తో ఒక క్లారిటీ వచ్చేసింది. అతనితో సినిమా చేయడానికి మన హీరోలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

తెలుగు హీరోలతోనే..

తెలుగు హీరోలతోనే..

కన్నడ తెలుగు హీరోలకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఇప్పుడు తమిళ్ బాలీవుడ్ లో కూడా మన హీరోలు మార్కెట్ క్రియేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు క్లారిటీ వచ్చేసింది. పాన్ ఇండియా సినిమాలకు డిమాండ్ ఎక్కువ అవ్వడంతో దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఎక్కువగా తెలుగు హీరోలతోనే సినిమాలు చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.

 పవర్ఫుల్ లైనప్

పవర్ఫుల్ లైనప్

కే జి ఎఫ్ చాప్టర్ 2 ఇప్పటికే విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా అనంతరం ప్రభాస్ సలార్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆ సినిమా అనంతరం ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి డీల్ సెట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కూడా అంచనాలకు తగ్గకుండా తెరకెక్కించాలని పవర్ఫుల్ కథను కూడా రెడీ చేసుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఆ కథను ఒప్పుకోవడానికి రెండు మూడు నెలలకు పైగా చర్చలు కూడా జరిపాడు.

Recommended Video

Siddharth & Sharwanand Interview With Ajay Bhupathi | Maha Samudram
 మరో ఐదేళ్లు తెలుగు హీరోలతోనే..

మరో ఐదేళ్లు తెలుగు హీరోలతోనే..

ఇక రీసెంట్ గా రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ తో సలార్ అనంతరం మరొక సినిమా చేసేందుకు కూడా ఒప్పందం కుదుర్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్టు తర్వాత ప్రభాస్ 24 ప్రాజెక్టుకు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు అయితే టాక్ వస్తోంది. దిల్ రాజు ఆ సినిమాను నిర్మించే అవకాశం ఉంది. ఇక ఈ ప్రాజెక్టులన్నీ కూడా ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వెళ్లాలి అనుకుంటున్న ప్రశాంత్ ఇంకో ఐదేళ్ల సమయం పడుతుంది. కన్నడ దర్శకుడు అయినప్పటికీ కూడా ప్రశాంత్ నీల్ తెలుగు హీరోలపై ఎక్కువగా ఫోకస్ చేస్తుండడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X