twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యూఎస్ఏలో ‘కెజిఎఫ్’ మళ్లీ... తొలి ఇండియన్ ఫిల్మ్, ఏ మూవీ దిక్కు లేకే?

    |

    2019 సంక్రాంతికి విడుదలైన సినిమాల బిజినెస్ యూఎస్ఏ మార్కెట్లో దాదాపుగా క్లోజింగ్ దశకు చేరుకుంది. ఈ పండక్కి తెలుగు నుంచి మూడు సినిమాలు విడుదలవ్వగా... 'ఎఫ్ 2' మాత్రమే మంచి లాభాలు తెచ్చి పెట్టింది. ఎన్టీఆర్-కథానాయకుడు, వినయ విధేయ రామ చిత్రాలు నిరాశ పరిచాయి.

    జనవరి 25న విడుదలైన సినిమాలైన హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలు కూడా ఆశించిన స్థాయిలో యూఎస్ఏ మార్కెట్లో ఫలితాలు రాట్టలేక పోయాయి. దీంతో ఈ వారం థియేటర్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చే పరిస్థితి ఉండటంతో యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంచి ఆదరణ ఉన్న 'కెజిఎఫ్' చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.

    తొలి ఇండియన్ మూవీ ఇదే

    తొలి ఇండియన్ మూవీ ఇదే

    సినిమా విడుదలై... బిజినెస్ ముగిసిన నెల రోజుల గ్యాపులో యూఎస్ఏ మార్కెట్లో రీ-రిలీజ్ అవుతున్న తొలి ఇండియన్ మూవీ ‘కెజిఎఫ్' కావడం గమనార్హం. అయితే ప్రేక్షకులు ఎలా స్పందిస్తారు? ఆదరణ ఎలా ఉంటుంది? అనేది తెలియాల్సి ఉంది.

    యూఎస్ఏలో ఎంత వసూలు చేసింది?

    యూఎస్ఏలో ఎంత వసూలు చేసింది?

    యూఎస్ఏలో ‘కెజిఎఫ్' మూవీ $800k వసూలు చేసింది. అయితే అక్కడ ఈ మూవీ పాజిటివ్ టాక్ స్క్రెడ్ అయి ప్రేక్షకులు థియేటర్లకు రీచ్ అయ్యో లోపే సినిమా ఎత్తేయడంతో చాలా మంది ఇండియన్ ఆడియన్స్ ఈ సినిమాపై ఆసక్తిగా ఉన్నారట. ఈ విషయం గమనించి యూఎస్ఏ డిస్ట్రిబ్యూటర్లు దీన్ని రీ రిలీజ్ చేస్తున్నట్లు టాక్.

    1 మిలియన్ వచ్చే ఛాన్స్

    1 మిలియన్ వచ్చే ఛాన్స్

    అయితే రీ రిలీజ్ వల్ల పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదని, అయితే ఓవరాల్ వసూళ్లు 1 మిలియన్ మార్క్ అందుకునే అవకాశం ఉందని టాక్. వాస్తవానికి యూఎస్ఏలో థియేటర్లు లీజ్ తీసుకున్న వారు ప్రస్తుతం ఉన్న సినిమాలకు ఆదరణ లేక పోవడంతో ‘కెజిఎఫ్' వేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, కన్నడలో ఉండటంతో అన్ని భాషల ప్రేక్షకులు వచ్చే అవకాశం ఉంది.

    కెజిఎఫ్

    కెజిఎఫ్

    యష్ హీరోగా రూపొందిన కన్నడ చిత్రం 'కెజిఎఫ్' తెలుగు, తమిళం, హిందీలో కూడా విడుదలై బాక్సాఫీసు వద్ద వసూళ్ల ప్రభంజనం క్రియేట్ చేసింది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 220 కోట్లు వసూలు చేసింది.

    English summary
    For the first time an Indian film KGF is re-releasing in USA within months of it’s first release. Today doesn’t have any prominent Kannada/Telugu releases in USA. We gotta see how movie lovers respond to it. KGF has already collected over $800k in USA.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X