ట్విట్టర్ రివ్యూ: మాస్ ఎలిమెంట్స్‌తో కేజీఎఫ్.. యష్ మెరిపించాడా!
Recommended Video

చాలా రోజులుగా ఓ కన్నడ చిత్ర పేరు మారుమోగుతోంది. రైజింగ్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ చిత్రం గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. ప్రమోషన్ కార్యక్రమాలు భారీ స్థాయిలో జరుగుతున్నాయి. దీనితో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. కేజీఎఫ్ చాప్టర్ 1 పేరుతో తొలి భాగాన్ని విడుదుల చేస్తున్నారు. యష్ మాస్ లుక్ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని భాషలలో ఈ చిత్రం విడుదలవుతుండగా ఇప్పటికే మార్నింగ్ షోలు ప్రారంభమయ్యాయి.
చూపు మరల్చలేని విధంగా
స్క్రీన్ ప్లే అదిరిపోయింది. క్షణం కూడా తెరనుంచి చూపు మరల్చలేరు. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇక బ్యాగ్రౌండ్ సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సినిమా స్థాయిని పెంచే విధంగా ఉంది.
రికార్డులు తుడిచిపెట్టే సినిమా
కెజిఎఫ్ చిత్రం చాలా బావుంది. కన్నడ సినిమా స్థాయిని తెలియజేసే చిత్రం ఇది. అన్ని చిత్రాలు రికార్డులు తుడిచిపెట్టే విధంగా ఉంది.
మాటలు రావడం లేదు
కేజీఎఫ్ చిత్రం చూశాక మాటలు రావడం లేదు. దర్శకుడు ప్రశాంత్ నీల్ ని ఖచ్చితంగా అభినందించాలి.
కన్నడ బాహుబలి
కెజిఎఫ్ చిత్రం కన్నడ బాహుబలి. ఈ రోజునుంచి కన్నడలో యష్ నెం1 హీరో అవుతాడు.
హీరోయిజం అదుర్స్
ఫస్ట్ హాఫ్ లో హీరోయిజం అదిరిపోయింది.
అద్భుతంగా ఉంది
కెజిఎఫ్ చాప్టర్ 1 చిత్రం చాలా బావుంది. తర్వాతి చాప్టర్ కోసం ఎదురుచూస్తున్నా.


Click it and Unblock the Notifications











