కరోనా కారణంగా కూలీగా మారిన కేజీఎఫ్ సంగీత దర్శకుడు.. తండ్రికి సాయంగా రోజుకు రూ.35!

కేజీఎఫ్ సినిమా గురించి, అది సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా విడమరిచి చెప్పాల్సిన పనే లేదు. రాఖీ భాయ్ అనే క్యారెక్టర్ దేశం మొత్తం వినబడేలా చేసింది కేజీఎఫ్. ఈ సినిమా కన్నడ రాకింగ్ స్టార్ యశ్.. రాఖీ భాయ్‌గా మారిపోయాడు. ఒకే ఒక చిత్రం కన్నడ చిత్రసీమను తలెత్తుకునేలా చేసింది. దేశం మొత్తం కన్నడ పరిశ్రమ వైపు తిరిగి చూసేలా చేసిన కేజీఎఫ్ ఓ కొత్త చరిత్రనే సృష్టించింది. అలాంటి చిత్రానికి వెన్నుముకలా నిలిచే సంగీతాన్ని అందించాడు రవి బస్రూర్. ప్రస్తుతం ఆయన ఓ కూలీగా మారి తండ్రికి సాయపడుతున్నాడు ఆ కథెంటో ఓ సారి చూద్దాం.

Recommended Video

KGF Music Director Turns Blacksmith, Earn Rs 35 | Video Goes Viral
బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మరో లెవెల్..

బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మరో లెవెల్..

కేజీఎఫ్ చిత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో మరో లెవెల్‌కు వెళ్లింది. ప్రతీ సీన్ ఓ ఇంట్రడక్షన్‌లా ఉండటం, ప్రతీ షాట్ ఎలివేషన్‌లానే ఉండటంతో అందుకు తగిన నేపథ్య సంగీతాన్ని అందించాడు రవి. ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా రవికి మంచి గుర్తింపు లభించింది. అలాంటి రవి.. కరోనా కారణంగా కూలీగా మారాడు.

విజృంభిస్తున్న కరోనా..

విజృంభిస్తున్న కరోనా..

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మానవాళిపై భీకర దాడి చేస్తోంది. మన దేశంలోనూ రోజురోజుకూ పరిస్థితి విషమించేట్టు కనిపిస్తోంది. శర వేగంగా దూసుకుపోతోన్న కరోనాను కట్టడి చేయలేకపోతోంది ప్రభుత్వం. ఇప్పటికే మన దేశంలో దాదాపు 1200మందికి పైగా కరోనా సోకింది.

దేశం మొత్తం లాక్ డౌన్..

దేశం మొత్తం లాక్ డౌన్..

కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14 వరకు దేశంలోని ప్రజలెవరూ రోడ్ల మీదకు రావొద్దని, ఇంటికి పరిమితం కావాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి తన కులవృత్తిని చేస్తున్నాడు.

వీడియో వైరల్..

వీడియో వైరల్..

దేవుడు పాత జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటాడు.. మనం కేవలం పాత్రధారులమే ఆయనే సూత్రధారి అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. బంగారం, వెండి ఆభరణాలను తయారు చేసే వృత్తిలో తండ్రికి సాయపడుతూ రోజుకూ రూ. 35 సంపాదిస్తున్నట్టు తెలిపాడు. ప్రస్తతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X