మరోసారి KGF కోసం రంగంలోకి రాజమౌళి.. సెంటిమెంట్ ప్లాన్!
బాహుబలి సినిమా ద్వారా రాజమౌళి పాన్ ఇండియా బాటను మరింత విస్తరింపజేశారనే చెప్పాలి. ఇక కంటెంట్ బావుంటే భాషతో స్టార్ డమ్ తో సంబంధం లేకుండా పాన్ ఇండియా సినిమాలు విజయం సాధిస్తాయాని KGF నీరూపించింది. యష్ హీరోగా నటించిన ఆ సినిమా దేశవ్యాప్తంగా సాలీడ్ కలెక్షన్స్ అందుకున్న విషయం తెలిసిందే.
అయితే ఆ KGF చాప్టర్ 1 సక్సెస్ కావడానికి రాజమౌళి పాత్ర చాలానే ఉంది. కొంత షూటింగ్ తరువాత చిత్ర యూనిట్ కొన్ని సీన్లను రాజమౌళికి చూపించడంతో వారి దశ తిరిగింది. ఆ సినిమా విజయాన్ని ముందే ఊహించిన జక్కన్న ఏ మాత్రం ఆలోచించకుండా అన్ని భాషల్లో రిలీజ్ చేయమని సలహా ఇచ్చాడట. అప్పటివరకు కనీసం హిందీలో ఎలా రిలీజ్ చేయాలనే ఆలోచన కూడా వారికి లేదు.

ఇక రాజమౌళి తన పరిచాయలతో బాలీవుడ్ నిర్మాతలకు పరిచయం చేయించారు. అప్పుడే బాలీవుడ్ లో కూడా ఆ సినిమా సక్సెల్ అయ్యింది. ఇక సెకండ్ చాప్టర్ కి కూడా రాజమౌళి సహాయం చేయనున్నట్లు తెలుస్తోంది. సెంటిమెంట్ ప్రకారం సినిమాకు సంబంధించిన స్పెషల్ టీజర్ ని దర్శకధీరుడి ద్వారానే రిలీజ్ చేయించాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇక KGF 2ని తెలుగులో రాజమౌళికి అత్యంత సన్నిహితుడైన సాయి కొర్రపాటి రిలీజ్ చేయనున్నారు కాబట్టి ఆయన కోసం కూడా జక్కన్న స్పెషల్ గా సినిమాను ప్రమోట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సినిమా షూటింగ్ ఏండింగ్ కి వచ్చేసింది. సంజయ్ దత్ తో కొంత షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది కాబట్టి సినిమా రిలీజ్ ఆలస్యం కావచ్చు. కానీ వచ్చే ఏడాదే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











