'మహేష్ ఖలేజా' స్పెల్లింగ్ కరెక్టుగా...అల్లు శిరీష్
మహేష్ ఖలేజా చిత్రం టైటిల్ కి నిర్మాత సింగనమల రమేష్ ..న్యూమరాలిజీ ప్రకారం KHAALEJA అని ఫిక్స్ చేసారు. అయితే మీడియాలో KHALEJA అని రాస్తున్నారు. ఈ విషయమై అల్లు శిరీష్ ట్విట్టర్ లో వివరణ ఇస్తూ...KHALEJA అనేది కరెక్టే అయినా నిర్మాత సంఖ్యా శాస్త్రం ఫాలో అవుతున్నారు కాబట్టి అదే కరెక్టు అని అన్నారు. అంటే నిర్మాత అన్ని విధాల జాగ్రత్తపడుతున్నారన్నమాట. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ ఏడున రిలీజ్ కానుంది. మణిశర్మ స్వరపరిచిన పాటలు సెప్టెంబర్ 27న విడుదల కానున్నాయి. ఈ చిత్రంలో మహేష్ సరసన అనుష్క హీరోయిన్ గా చేస్తోంది. యాక్షన్ కలగలిసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం రూపొందిదని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు క్యాబ్ డ్రైవర్ గా నటిస్తున్నారు. ప్రకాష్ రాజు విలన్ గానూ, అనుష్క..మహేష్ ఎప్పుడూ దురదృష్టం తెచ్చిపెట్టే డబ్బున్న అమ్మాయి బంగారంగా ఈ చిత్రంలో నవ్వులు కురిపించనుంది.


Click it and Unblock the Notifications











