సిగ్గు మొగ్గేసిన మెగాస్టార్... (ఖైదీ నెం 150 డిలేటెడ్ సీన్)
మెగాస్టార్ అభిమానుల కోసం కొణిదెలప్రొడక్షన్స్ నుండి ‘ఖైదీ నెం 150’ సినిమాకు సంబంధించి ఎడిటింగులో తీసేసిన సీన్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు.
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి నటించిన 150వ చిత్రం సంక్రాంతికి విడుదలైన భారీ విజయాన్ని అందుకుంది. మెగాస్టార్ రీఎంట్రీకి బాక్సాఫీసు షేక్ అయింది. బాహుబలి తర్వాత భారీ వసూళ్లు సాధించిన టాలీవుడ్ చిత్రంగా ఖైదీ నెం 150 రికార్డులకెక్కింది.
కాగా... మెగాస్టార్ అభిమానుల కోసం కొణిదెలప్రొడక్షన్స్ వారు సినిమాలో ఎడిటింగులో తీసేసిన సీన్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా చిరంజీవి, కాజల్ మధ్య వచ్చే లవ్ ట్రాక్ కు సంబంధించిన ఓ సీన్ యూట్యూబ్ ద్వారా విడుదల చేయగా మంచి స్పందన వస్తోంది.
సిగ్గు మొగ్గేసిన చిరు
మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి వేరియేషన్ అయినా అద్భుతంగా పండించగలరు. తాజాగా రిలీజ్ చేసిన డిలేడెట్ సీన్లో మెగాస్టార్ సిగ్గుపడే సీన్ సూపర్భ్ అనేలా ఉంది. అఫ్ కోర్స్ సిగ్గుపడే సీన్ పండించడంలో ఆయన్ను మించిన యాక్టర్ టాలీవుడ్లో లేరనుకోండి!

మరిన్ని డిలీటెడ్ సీన్లు
ఖైదీ నెం 150 చిత్రానికి సంబంధించి మరిన్ని డిలెటెడ్ సీన్లు వరుస పెట్టి రిలీజ్ చేయబోతున్నట్లు స్పష్టమవుతోంది. సినిమాలో ఎడిటింగ్‌లో మిస్సయిన సీన్లు అభిమానులకు కనువిందు చేయబోతున్నాయన్నమాట.

50 కోట్ల లాభం
ఖైదీ నెం 150 సినిమా ద్వారా నిర్మాత రామ్ చరణ్ కు ఓవరాల్‌గా రూ. 50 కోట్ల లాభం వచ్చినట్లు తెలుస్తోంది. చరణ్ నిర్మాతగా తొలి ప్రయత్నంలో భారీ లాభాలను తన ఖాతాలో వేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.



Click it and Unblock the Notifications











