twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'కబాలి' ఫీట్: 'ఖైదీ నం 150' రిలీజ్ రోజు శెలవు ప్రకటించిన అరబ్ కంపెనీ

    'ఖైదీ నం 150' చూసేందుకు తమ సంస్థ ఉద్యోగులు అత్యధికులు జనవరి 11న సెలవు పెడతారని భావించిన ఓ అరబ్ సంస్థ ఏకంగా సెలవు ప్రకటించింది.

    By Srikanya
    |

    హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రం 'ఖైదీ నం 150' సంక్రాంతి కానుకగా మరో రెండు రోజుల్లో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై విదేశాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని చూసేందుకు తమ సంస్థ ఉద్యోగులు అత్యధికులు జనవరి 11న సెలవు పెడతారని భావించిన ఓ అరబ్ సంస్థ ఏకంగా సెలవు ప్రకటించింది.

    మస్కట్ లోని 'అల్ రియాద్ కన్ స్ట్రక్షన్ అండ్ ట్రేడింగ్ ఎల్ఎల్సీ' అనే సంస్థ 'బాస్ ఈజ్ బ్యాక్' అంటూ ఉద్యోగులకు సెలవు ఇచ్చింది. ఒమన్ లోని అల్-వాడీ ఎల్ కబీర్ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ నిర్మాణ రంగంలో సేవలందిస్తోంది.

    సిని ప్రియులకు మరో పండగొచ్చిందని చెప్తూ, మూవీ మొఘల్, కింగ్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చిరంజీవి 150 వ చిత్రాన్ని తమ ఉద్యోగులు సెలబ్రేట్ చేసుకుంటారని పేర్కొంది. సినీ దిగ్గజం చిరంజీవిని దేవుడిలా కొలిచే ఉద్యోగుల కోసం సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. కాగా గత ఏడాది తలైవా రజనీకాంత్ కబాలీ సినిమా రిలీజ్ సందర్బంగా విదేశాల్లోనే కాదు మన దేశంలోనూ చాలా కంపెనీలు శెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.

    'Khaidi no 150' fever: Arab Company declare holiday on Friday

    ఇక ''పొగరు నా ఒంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది'. 'కార్పొరేట్‌ బీర్లు తాగిన బాడీ రా నీది. కార్పొరేషన్‌ నీళ్లు తాగిన బాడీ నాది. నాతో పెట్టుకోకు, ఆఫ్టర్‌ ఎ గ్యాప్‌ బాస్‌ ఈజ్‌ బ్యాక్‌'' అనే డైలాగ్‌తో పాటు, ''ఢిల్లీకి పోయాడు డ్యాన్సులకి దూరమైపోయాడు... హస్తినాపురానికి పోయాడు హాస్యానికి దూరమయ్యాడు... ఈ మధ్య కాలంలో మా మధ్య లేడు మాసుకి దూరమయ్యాడు అనుకొన్నారేమో! అదే మాసు, అదే గ్రేసు, అదే హోరు, అదే జోరు, అదే హుషారు'' అంటూ చిరంజీవి ఈ సంక్రాంతికి వచ్చేస్తున్నారు.

    ఆయన హీరోగా నటించిన చిత్రం 'ఖైదీ నంబర్‌ 150'. కాజల్‌ హీరోయిన్. వి.వి.వినాయక్‌ దర్శకుడు. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరకర్త.

    'శంకర్‌దాదా జిందాబాద్‌' పూర్తయినప్పట్నుంచి మళ్లీ మేకప్‌ వేసుకున్న క్షణం వరకు మధ్యలో ఉన్న ఈ పదేళ్ల కాలం పది క్షణాల్లా గడిచిపోయింది. ఆ సమయం తెలియకుండా చేసిన ఆ శక్తి, నాలో మళ్లీ పాతికేళ్ల క్రితం నాటి ఉత్సాహాన్ని నింపిన శక్తి... ప్రేక్షకుల అభిమానమే'' అన్నారు చిరంజీవి.

    చిరంజీవి మాట్లాడుతూ '150వ సినిమా చేయాలని నిర్ణయించుకొన్నాక చాలా కథలు విన్నాం. తమిళ చిత్రం 'కత్తి' చూశాక నా 150వ సినిమాకి తగిన కథ ఇదే అనిపించింది. రైతులకి భరోసాగా నిలబడే వీరోచితమైన పాత్ర ఇందులో ఉంది. ఇక ఈ కథ అనుకోగానే నాకు స్ఫురణకి వచ్చిన దర్శకుడు వినాయక్‌. 'మన అభిమానులు కోరుకొనేలా మన సినిమా ఉండాలంటే, ఏ దర్శకుడైతే మన అభిమానో అతనితో సినిమా చేయాలంటుంటాడు' నా మిత్రుడు రజనీకాంత్‌. నా అభిమాని అయిన వి.వి.వినాయక్‌ నిజంగా నన్ను చక్కగా ఆవిష్కరించాడు.

    నన్ను అందంగా చూపించిన రత్నవేలుకే ఆ క్రెడిట్‌ దక్కుతుంది. దేవిశ్రీప్రసాద్‌ ఒకొక్క పాటని ఆణిముత్యంలా తయారు చేసి ఇచ్చాడు. నేను స్టైలిష్‌ లుక్‌తో కనిపిస్తున్నానంటే నా కుమార్తె సుస్మితనే కారణం. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ గురించి తప్పకుండా చెప్పాలి. ఇంత సమర్థవంతమైన నిర్మాత అవతామెత్తుతాడని నేను వూహించలేదు. రామ్‌చరణ్‌కి నటనా పరమైన హద్దులతో పాటు నిర్మాణానికి సంబంధించిన పద్దులు కూడా తెలుసు. కాజల్‌ నాతో పోటీపడి నటించి శభాష్‌ అనిపించింది. ' అన్నారు.

    English summary
    Al Riyad Construction & Trading LLC in their notice to the employees stated, “Another event of events for movie lovers!!! on this ground breaking, festive occasion of 150′ movie release of our demigod, movie mogul, king of kings of Telugu film industry, we feel very much delighted to declare one day holiday 11-01-2017 to our beloved workforce to take part in that eye feast movie watching celebration. We are doing this as a token of our boundless love, worship of our cine idol sri chiranjeevi Garu who was is and will be an irresistible charismatic, evergreen personality. Boss is back!”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X