»   »  అదిరింది గురూ...మెగాస్టార్ ‘ఖైదీ నెంబర్ 150’ మోషన్ పోస్టర్

అదిరింది గురూ...మెగాస్టార్ ‘ఖైదీ నెంబర్ 150’ మోషన్ పోస్టర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా 150వ సినిమా శరవేగంగా తెరకెక్కుతోంది. వి.వి.వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ పతాకంపై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో కథానాయికగా చందమామ కాజల్ ఫైనల్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 50 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఎప్పటినుంచో చిరంజీవి 150వ సినిమాకు రకరకాల టైటిల్స్ ఊహాగానాలయ్యాయి. అయితే ఈ సినిమాకి నూటికి నూరు శాతం సరిపడే "ఖైదీ నెంబర్ 150'' అనే పేరును ఖరారు చేసినట్లు చిత్ర నిర్మాత రామ్ చరణ్ తెలిపారు.

మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న 150వ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేసారు.

స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు...

మెగా మెరుపులు

మెగా మెరుపులు

షూటింగ్ ఆన్ లొకేషన్ నుంచి మెగాస్టార్ చిరంజీవి యాక్టింగ్ స్టయిల్ గురించి ఛాయాగ్రాహకుడు రత్నవేలు ఇదివరకే ఓ అప్డేట్ అందించారు. మెగాస్టార్ షూటింగ్లో ఎంతో ఎనర్జిటిక్గా చేస్తున్నారంటూ రత్నవేలు కితాబిచ్చారు. ప్రస్తుతం ఈ విషయంపై ఫిలింనగర్లో చర్చ సాగుతోంది.

హుషారు

హుషారు

మెగా ఫ్యాన్స్లో ఒకటే హుషారు. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. చిరు స్టెప్పేస్తే, చిరు చిందేస్తే ఎలా ఉంటుందో ముందు ముందు చూడబోతున్నాం. అన్నయ్యలో మునుపటి ఎనర్జీ రీలోడ్ అయ్యిందన్న చిత్రయూనిట్ టాక్ తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

పూజలు, హోమాలు

పూజలు, హోమాలు

ఇదే ఉత్సాహంలో ఆగస్టు 22న మెగాస్టార్ బర్త్డేని పురష్కరించుకుని ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టాప్ టెంపుల్స్లో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో నవతరం హీరోలు సాయిధరమ్ తేజ్, అల్లు శిరీష్ కుటుంబ సమేతంగా పాల్గొనడం విశేషం. మెగాఫ్యాన్స్ ఈ ఉత్సవాల్ని హుషారుగా దగ్గరుండి దిగ్విజయంగా నడిపించారు.

ప్రతిష్టాత్మకం

ప్రతిష్టాత్మకం

ప్రతిష్ఠాత్మక 150వ సినిమాని స్టార్ డైరెక్టర్ వినాయక్ సరికొత్త పంథాలో తెరకెక్కిస్తున్నారన్నది చిత్రయూనిట్ మాట. చిరును మరో లెవల్లో ఆవిష్కరించేందుకు వినాయక్ అన్నివిధాలా ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నారు.

చిరంజీవి

చిరంజీవి

అందుకు తగ్గట్టే మునుపటి జోష్ ఏమాత్రం తగ్గకుండా మెగాస్టార్ హుషారుగా షూటింగులో పాల్గొంటున్నారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్ అంశాలతో, మన నేటివిటీకి తగ్గ కథాంశమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని చిత్రయూనిట్ చెబుతోంది.

స్పెషల్

స్పెషల్

150వ సినిమా మ్యూజిక్ సంథింగ్ స్పెషల్గా ఉండబోతోంది. ఎనర్జిటిక్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఈ సినిమాకి చక్కని ట్యూన్స్ సిద్ధం చేశారు. శంకర్ దాదా సిరీస్లో పెప్పీ నంబర్స్కి ఏమాత్రం తగ్గని రీతిలో ఈ సినిమా సంగీతం ఉండబోతోంది.

అన్నీ..

అన్నీ..

ఈ కథలో చిరంజీవి గారి నుంచి ప్రేక్షకాభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఉంటాయి. కామెడీ, మ్యూజిక్, ఫైట్స్, సెంటిమెంట్, ఎంటర్ టైన్ మెంట్ అన్నీ ఉంటాయి. సామాన్య రైతుల సమస్య గురించి పోరాడే నాయకుడి పాత్రలో చిరంజీవిగారు నటిస్తున్నారు అని వినాయక్ తెలిపారు.

వివి వినాయక్

వివి వినాయక్

ఈ కథని శ్రేయోభిలాషులందరికీ వినిపించడం జరిగింది. అలాగే చిరంజీవి గారితో పాటు నిర్మాత రామ్ చరణ్, ఫ్యామిలీ సభ్యులందరూ విని ఆనందించారు. వారందరూ ఒకే మాటగా అద్భుతంగా ఉందంటూ ప్రశంసించడం నాకు మరింత సంతోషాన్ని కలిగించింది. చిరంజీవి గారు, నేను ఎంత ఆనందంగా ఉన్నామో అంతే ఆనందంగా వారందరూ ఉన్నారు. ప్రేక్షకులు, అభిమానులు కూడా ఆనందించేలా ఈ సినిమా ఉంటుంది అని తెలిపారు.

ఖైదీ నెం 150

ఖైదీ నెం 150

ఈ చిత్రానికి రచన : పరుచూరి బ్రదర్స్ , కెమెరా: రత్నవేలు, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్ , కళ: తోట తరణి, ఎడిటింగ్ : గౌతమ్ రాజు, స్ర్కీన్ ప్లే-దర్శకత్వం: వి.వి.వినాయక్

Alsoread: యమున చెప్పిన పూర్తి విశేషాలు: వ్యభిచారం కేసు, ఫ్యామిలీ, చిరు, పవన్, ఇంకా చాలా...

English summary
Konidela Production Company brings you the official first look motion poster of Khaidi No:150 starring Megastar Chiranjeevi, in association with Lyca Productions.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu