అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు... చిరు 150 మూవీ సాంగ్ అదిరింది
తాజాగా ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఆడియోలోని ఓ పాటను రిలీజ్ చేసారు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు... అంటూ సాగే ఈ పాటకు దేవిశ్రీ అందించిన మ్యూజిక్ సూపర్బ్ అంటున్నారు.
హైదరాబాద్: మెగా స్టార్ చిరంజీవి 150వ సినిమాపై అంచనాలు ఏ రేంజిలో ఉన్నాయో అందరికీ తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన చిత్రం టీజర్ కు మంచి స్పందన వచ్చింది.
ఆడియో వేడుక జరుగుతుందని అభిమానులంతా భావించారు కానీ.... ఎలాంటి వేడుక లేకుండానే ఆడియోను నేరుగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే జనవరి 4న ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ చరణ్ 'ధృవ'మూవీ విషయంలో కూడా ఇదే పద్దతి పాటించారు.

తాజాగా ఈ రోజు (డిసెంబర్ 18)న 6 గంటలకు ఆడియోలోని ఓ పాటను రిలీజ్ చేసారు. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు... అంటూ సాగే ఈ పాటకు దేవిశ్రీ అందించిన మ్యూజిక్ సూపర్బ్ అంటున్నారు. అభిమానులు. ఆ పాటను మీరూ వినండి మరి.
అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ మాస్ ఆడియన్స్ కి పిచ్చెక్కిస్తోంది. సినిమాలోని ఇతర సాంగ్స్ కూడా ఇదే రేంజిలో ఉంటాయని భావిసస్తున్నారు. ఈ సాంగ్ కి చిరు తన మార్క్ డాన్స్ వేసాడు. అందుకు సంబంధించిన పోస్టర్లు కూడా రిలీజ్ చేసారు. జనవరి 11న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











